యాప్నగరం

బాధ్య‌త‌లు స్వీక‌రించిన విద్యాసాగ‌ర్ రావు

శుక్ర‌వారం చెన్నై చేరుకున్న విద్యాసాగ‌ర‌రావుకు విమానాశ్ర‌యంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌, ఆమె మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు స్వాగ‌తం ప‌లికారు.

TNN 3 Sep 2016, 10:34 am
త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా సీహెచ్ విద్యాసాగ‌ర‌రావు శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ప్ర‌స్తుతం మ‌హ‌రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ఉన్న సీహెచ్ విద్యాసాగ‌ర‌రావుకు కేంద్రం అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. శుక్ర‌వారం చెన్నై చేరుకున్న విద్యాసాగ‌ర‌రావుకు విమానాశ్ర‌యంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌, ఆమె మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రులు స్వాగ‌తం ప‌లికారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్ లో
Samayam Telugu maharashtra governor c vidyasagar rao takes additional charge of tamil nadu
బాధ్య‌త‌లు స్వీక‌రించిన విద్యాసాగ‌ర్ రావు

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ విద్యాసాగరరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో సీఎం జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.