యాప్నగరం

రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న 'మహా' సర్కార్

రైతులకి ఇచ్చిన రుణాలని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అన్నదాతలు రోడ్డెక్కనున్న నేపథ్యంలో ముందే

TNN 11 Jun 2017, 7:40 pm
రైతులకి ఇచ్చిన రుణాలని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రేపు అన్నదాతలు రోడ్డెక్కనున్న నేపథ్యంలో ముందే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణాలని మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే, అంతకన్నా ముందుగా రుణమాఫీ పథకం అమలు చేయడానికి అవసరమైన విధివిధానాల రూపకల్పన కోసం ఓ కమిటీ వేయాలని నిర్ణయించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తరపున కొంతమంది ప్రతినిధులు, రైతు సంఘాల తరపున ఇంకొంత మంది ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా వుండనున్నారు.
Samayam Telugu maharashtra govt announces loan waiver for farmers
రైతుల రుణాలు మాఫీ చేస్తామన్న 'మహా' సర్కార్


ఇదిలావుంటే, తమ డిమాండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రేపు తలపెట్టిన బంద్‌ను ఉపసంహరించుకున్నట్టు అక్కడి రైతులు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందన్న నమ్మకంతోనే ప్రస్తుతానికి బంద్‌ని ఉపసంహరించుకుంటున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు వారికి జులై 24 వరకు గడువు వుంది. ఒకవేళ అప్పటిలోగా ప్రభుత్వం రుణమాఫీ చేయకపోతే, మళ్లీ జులై 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని రైతుల సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. అంతేకాకుండా అసలైన అన్నదాతలకే ఆ రుణమాఫీ పథకం ఫలాలు అందాలని... అలా కాకుండా రాజకీయ నాయకులు, వ్యాపారులు, ఉద్యోగస్తులకి కూడా లాభం చేకూరేలా వ్యవహరించడానికి వీలు లేదని రైతు సంఘాల ప్రతినిథులు తేల్చిచెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.