యాప్నగరం

రేషన్ కార్డుపై రూ.2లకే కిలో ఉల్లిపాయ

ఇప్పటివరకు బియ్యం, పంచదార, పప్పుదినుసులు, నూనె వంటి వంటింటి సరుకులని పౌరసరఫరాల శాఖ ద్వారా సబ్సీడీ...

Samayam Telugu 12 Jun 2017, 11:04 pm
ఇప్పటివరకు బియ్యం, పంచదార, పప్పుదినుసులు, నూనె వంటి వంటింటి సరుకులని పౌరసరఫరాల శాఖ ద్వారా సబ్సీడీ ధరలకే రేషన్‌పై అందుకున్న తెల్ల రేషన్ కార్డుదారులకి ఇకపై కిలోకి రూ.2లకే ఉల్లిపాయలు సైతం లభించనున్నాయి. అయితే, అది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదులెండి! ఎందుకంటే, ఈ ఆఫర్ ప్రకటించింది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కనుక. అవును, ఇకపై దారిద్య్రరేఖకి దిగువన వున్న నిరుపేదలకి రేషన్ కార్డుపై రూ.2 లకే కిలో ఉల్లిపాయలు సరఫరా చేస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు.
Samayam Telugu maharashtra govt to supply kg onion for rs 2 through pds
రేషన్ కార్డుపై రూ.2లకే కిలో ఉల్లిపాయ


సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తన నిర్ణయాన్ని వెల్లడించిన సీఎం... వెంటనే ఈ పథకాన్ని అమలు చేయాలని సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుంచి క్వింటాకు రూ.800 చొప్పున చెల్లించి ఉల్లి కొనుగోలు చేయాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాకపోతే, యూనిట్‌కి ఎన్ని కిలోల ఉల్లిపాయ సరఫరా చేస్తారనేదానిపై మాత్రం ప్రస్తుతానికి స్పష్టత లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.