యాప్నగరం

తాగిన డ్రైవర్, ట్రక్కు నడిపిన మంత్రి

మహారాష్ట్ర మంత్రి ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని ఓ ట్రక్కును తానే స్వయంగా నడిపారు.

TNN 30 Apr 2017, 12:18 pm
మహారాష్ట్ర మంత్రి ట్రాఫిక్ అంతరాయం కలుగుతోందని ఓ ట్రక్కును తానే స్వయంగా నడిపారు. ఆ ట్రక్కు డ్రైవర్ మందుతాగి సరిగా తెలివిలో కూడా లేడు. దీంతో మంత్రే రంగంలోకి దిగారు. మహారాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ జల్‌గావ్ ప్రాంతం మీదుగా కారులో వెళుతున్నారు. దారిలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతగా ట్రాఫిక్ ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకున్నారు మంత్రి గారు. భారీ ట్రక్కును ఓ తాగుబోతు డ్రైవర్ అడ్డుగా నిలిపాడని, దీంతో వాహనాలన్నీ ఆగిపోయాయని తెలుసుకున్నారు. వెంటనే కారు దిగి ట్రక్కు ఎక్కారు. దానిని రోడ్డు మధ్యలో నుంచి తీసి ఓ పక్కకు నడిపారు. మిగతా వాహనాలకి దారి దొరకడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. మంత్రి ట్రక్కు నడుపుతున్నప్పుడు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాగా తాగి వాహనం నడపడంతో పాటూ, ట్రాఫిక్ జామ్ తో పబ్లిక్ న్యూసెన్స్ చేసిన డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాకెందుకులే అని ఊరుకోకుండా మంత్రి చేసిన పనిని అందరూ మెచ్చుకున్నారు.
Samayam Telugu maharashtra minister drives truck to clear traffic jam
తాగిన డ్రైవర్, ట్రక్కు నడిపిన మంత్రి

#WATCH: Maharashtra minister Girish Mahajan drives a truck to clear traffic, after the drunk driver was detained,leaving truck on road(28/4) pic.twitter.com/Pcju5EWxPa — ANI (@ANI_news) April 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.