యాప్నగరం

మహారాష్ట్రలో నేటి రాత్రే కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

Maharashtra new Chief Minister: మహారాష్ట్రలో బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. రెబల్ ఎమ్మెల్యేల్లో 10 మందికి మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 30 Jun 2022, 4:55 pm
హారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరేందుకు రంగం సిద్ధమైంది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర సీఎంగా గురువారం (జూన్ 30) రాత్రి 7.30 గంటలకు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ షిండేతో ప్రమాణం చేయించనున్నారు. రెబల్ ఎమ్మెల్యేల్లో 10 మందికి మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu దేవేంద్ర ఫడ్నవీస్‌తో తిరుగుబాటు నేత షిండే
Devendra Fudnavis and Eknath Shinde


అంతకుముందు గోవా క్యాంప్ నుంచి ఏక్‌నాథ్ షిండే ఒక్కరే ముంబై బయల్దేరి వచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఆయన దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లి ఆయణ్ని కలిశారు. అనంతరం ఇరువురు నేతలు రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌ను కలిశారు. 49 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు.

న్యాయంగా చూసుకుంటే అధికారం మాకే దక్కాలి..
మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని దేవేంద్ర ఫడ్నవీస్ గుర్తు చేశారు. ‘శివసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ప్రజా తీర్పునకు విరుద్ధంగా శివసేన తప్పుకుంది. మహా వికాస్ అఘాడీ పేరుతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. న్యాయంగా చూసుకుంటే అధికారం బీజేపీకి దక్కాల్సిందే’ అని ఫడ్నవీస్ అన్నారు.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.