యాప్నగరం

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్.. గత రికార్డులన్నీ బ్రేక్.. ఒకే రోజులో ఈ స్థాయిలోనా?

మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నడూ లేని రీతిలో ఒకే రోజు భారీ సంఖ్యలో ఇక్కడ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

Samayam Telugu 21 Mar 2021, 10:47 pm
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో ఇక్కడ 30,535 కొత్త కేసులను గుర్తించారు. కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి మహారాష్ట్రలో ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 2,479,682కు చేరింది. కోవిడ్ బారిన పడి గత 24 గంటల్లో 99 మంది చనిపోగా.. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 53,399కు చేరింది. మహారాష్ట్రలో 210,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ మరణాల రేటు 2.15 శాతంగా ఉంది.
Samayam Telugu Mumbai Corona Reuters


మహారాష్ట్రలో ప్రస్తుతం 969,867 మంది హోం క్వారంటైన్లో ఉన్నారు. 9,601 ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.5 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 11,000 మంది కోవిడ్ నుంచి కోలుకోవడం ఊరటనిస్తోంది. రాష్ట్రంలో రికవరీ రేటు 89.32 శాతంగా ఉంది.

ఆదివారం 138,199 మందికి కరోనా టెస్టులు చేయగా.. 22.09 శాతం మందికి పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. ముంబై నగరంలో కొత్తగా 3775 మంది కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నాగ్‌పూర్‌లో 3614 కేసులు నమోదయ్యాయి. పుణే జిల్లాలో కొత్తగా 5408 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క పుణేలోనే 2900 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.