యాప్నగరం

మహారాష్ట్ర టైమ్స్ మాజీ ఎడిటర్ కన్నుమాత

పత్రికా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ పాత్రికేయుడు, మహారాష్ట్ర టైమ్స్ మాజీ ఎడిటర్ గోవింద్ తల్వాకర్ అమెరికాలో కన్నుమూశారు.

TNN 22 Mar 2017, 9:32 am
పత్రికా రంగానికి విశేష సేవలు అందించిన సీనియర్ పాత్రికేయుడు, మహారాష్ట్ర టైమ్స్ మాజీ ఎడిటర్ గోవింద్ తల్వా‌ల్కర్ అమెరికాలో కన్నుమూశారు. 91 ఏళ్ల గోవింద్ తల్వాకర్ అమెరికాలోని హుస్టన్ నగరంలో తుదిశ్వాస విడిచారు. పాత్రికేయ రంగంలో ఆయన సేవలకు గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం లోకమాన్య తిలక్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు ఉత్తమ పాత్రికేయులకు అందజేసే బీడీ గోయెంకా అవార్డ్, దుర్గా రతన్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు.
Samayam Telugu maharashtra times former editor govind talvalkar passed away
మహారాష్ట్ర టైమ్స్ మాజీ ఎడిటర్ కన్నుమాత


అంతే కాకుండా సామాజిక న్యాయం విభాగంలో అందించే రామశాస్త్రి పురస్కారం కూడా తల్వాకర్‌‌ను వరించింది. 1968లో మహారాష్ట్ర టైమ్స్‌కు చీఫ్ ఎడిటర్‌గా నియమితులైన గోవింద్ తల్వాల్కర్ పదవీ విరమణ చేసేవరకు 27 ఏళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. 1996లో బాధ్యతలు నుంచి తప్పుకున్న తల్వాకర్ తన ఎడిటోరియల్స్, ఆర్టికల్స్‌తో పాఠకులను ఆకట్టుకున్నారు.

అలాగే స్వయంగా 25 పుస్తకాలు రచించారు. కేవలం పాత్రికేయ వృత్తికే పరిమితం కాకుండా సాహిత్యం, రాజకీయం, విద్య, సామాజిక, సాంస్కృతిక‌ రంగాల్లోనూ తనదైన ముద్రవేశారు. స్వాతంత్రం తర్వాత మహారాష్ట్రలో సుమారు నలభైఏళ్ల పాటు పత్రిక రంగానికి తన మేధస్సుతో సేవలను అందించారు. అలాగే రెండు తరాల మరాఠాలకు మార్గదర్శిగా ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.