యాప్నగరం

దారుణం: కట్నం తేలేదని భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌!

రక్తం, లేక సెలైన్‌ లాంటివి ఎక్కించడం ద్వారా హెచ్‌ఐవీ వచ్చిందా.. లేక సెక్స్‌ చేయడం వల్ల ఆ వైరస్‌ సోకిందా అని డాక్టర్ల నివేదికను పోలీసులు కోరారు.

Samayam Telugu 1 Dec 2018, 3:26 pm
అదనపు కట్నం కోసం ఓ వివాహిత(27) జీవితాన్ని అత్తింటి వారు నాశనం చేశారు. పుట్టింటి నుంచి డబ్బు ఎలాగూ తీసుకురాదని, భార్యపై కోపంతో ఆమెకు ప్రమాదకర హెచ్‌ఐవీ వైరస్‌ ఎక్కించాడు. దీనిపై భార్య ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పింప్రి-ఛించ్వాడ్‌ పట్టణం పింపుల్‌ సౌదాగర్‌ ఏరియా పరిదిలో కేసు నమోదైంది. వాకడ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీస్‌ మానే కథనం ప్రకారం.. 2015 ఏప్రిల్‌లో స్థానిక హోమియోపతి డాక్టర్‌తో ఆమెకు వివాహమైంది. అయితే పెళ్లైన కొన్నిరోజులకే వరకట్న వేధింపులు అధికమయ్యాయి.
Samayam Telugu Maharastra Woman


భర్తతో పాటు అతడి కుటుంబసభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారు. 2017లో అనారోగ్యం పాలైనప్పుడు తనకు ఇచ్చిన ఇంజెక్షన్‌, ఎక్కించిన సెలైన్‌లో హెచ్‌ఐవీ పేషెంట్ల రక్తం కలిపాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తనపై భర్త ఆరోపణలు చేయడంతో రక్తపరీక్ష, ఇతరత్రా టెస్టులు చేయించగా వివాహితకు హెచ్‌ఐవీ పాజిటివ్‌ వచ్చింది. అదే సమయంలో భర్త తనకు హెచ్‌ఐవీ వైరస్‌ను ఎక్కించాడని ఆమె ఫిర్యాదు చేసింది. భర్త కారణంగానే తనకు హెచ్‌ఐవీ లాంటి ప్రమాదకర వైరస్‌ వ్యాపించి ఆరోగ్యం క్షీణించిందని ఫిర్యాదులో పేర్కొంది.

రక్తం, లేక సెలైన్‌ లాంటివి ఎక్కించడం ద్వారా హెచ్‌ఐవీ వచ్చిందా.. లేక సెక్స్‌ చేయడం వల్ల ఆ వైరస్‌ సోకిందా అని డాక్టర్ల నివేదికను పోలీసులు కోరారు. ఆపై చర్య తీసుకోనున్నట్లు వివరించారు. భర్తకు కూడా హెచ్‌ఐవీ సోకిందని ఆమె ఆరోపించారు. గృహహింస కింద కేసు నమోదు చేసినా ఎలాంటి అరెస్టులు జరగలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.