యాప్నగరం

Kolkata: దుర్గాదేవి విగ్రహంపై వివాదం... రాక్షసుడిగా మహాత్మాగాంధీ... ఫోటోలు వైరల్

కోల్‌కతాలో (Kolkata) దసరా సందర్భంగా దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం వివాదాస్పదమైంది. అందులో రాక్షసుడి రూపంలో ఏర్పాటు చేసిన విగ్రహం మహాత్మా గాంధీ పోలికలతో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో.. చాలా వర్గాలు విమర్శలు గుప్పించాయి. తీవ్రంగా వ్యతిరేకించాయి. పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వడంతో.. వారు అక్కడకు వెళ్లి విగ్రహాన్ని మార్చాలని చెప్పారు. దాంతో దుర్గాపూజ నిర్వాహకులు దీనికి అంగీకరించారు. రాజకీయ పార్టీలు సైతం దీనిపై స్పందించాయి.

Authored byAndaluri Veni | Samayam Telugu 3 Oct 2022, 1:15 pm

ప్రధానాంశాలు:

  • దసరా సందర్భంగా దుర్గాదేవి మండపాలు
  • గాంధీని చంపుతున్నట్టు దేవి విగ్రహం
  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Durga Devi
Kolkata: దసరా సందర్భంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ఓ దుర్గా దేవి విగ్రహం.. వివాదాస్పదమైంది. దుర్గామాత కాళ్ల దగ్గర ఉండే మహిషాసురుడు అంటే రాక్షసుడి విగ్రహం మహాత్మా గాంధీని (Mahatma Gandhi) పోలి ఉండడమే దీనికి కారణం. దీనిపై పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో గాంధీని పోలిన విగ్రహాన్ని వారు మార్చేందుకు ఆ పూజా నిర్వాహకులు అంగీకరించారు. పురాణ కథల ప్రకారం దుర్గాదేవి దుష్టపాలనను అంతం చేయడానికి మహిషాసురుడిని వధించింది.
సాధారణంగాఈ కథను అనుసరించే దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్టింస్తుంటారు. కోల్‌కతాలో కూడా మహిషాసురుడితో కలిపి దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ మహిషాసుడి ముఖం మహాత్మా గాంధీని పోలి ఉందని... దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన తర్వాత కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్యపై వివిధ వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు పోలీసు బృందం అక్కడకు వెళ్లి.. ఆ ముఖాన్ని మార్చమని కోరినట్టు అఖిల భారతీయ హిందూ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి చెప్పారు. పోలీసులు దానిని మార్చమని మమ్మల్ని అడిగారని, మహిషాసురుడి విగ్రహానికి మీసాలు, వెంట్రుకలు వేస్తామన్నామని గోస్వామి చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని తమకు లేదని చెప్పారు.


అయితే మహిషాసురుడు గాంధీ పోలికలతో ఉండడాన్ని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వంటి రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించాయి. ఇది జాతిపితని అవమానించడమే అవుతుందని, ఇది దేశంలోని ప్రతి పౌరుడిని అవమానించడమేనని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ అన్నారు. ఇలాంటి అవమానంపై బీజేపీ ఏం చెబుతుందని ప్రశ్నించారు. గాంధీని హత్య చేసిన వ్యక్తి ఏ సైద్ధాంతిక శిబిరానికి చెందినవాడో తమకు తెలుసునని ఘోష్ అన్నారు.

దీనిపై బీజేపీ కూడా స్పందించింది. ఇలాంటి చర్య చాలా దురదృష్టకరమని, దానిని పూర్తి ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు. కాగా ప్రతి ఏడాది దసరా సందర్భంగా చాలామంది పూజా నిర్వాహకులు ఒక థీమ్‌ను ఎంచుకుంటారు. సామాజిక సమస్యలను ప్రతిబింబించే విధంగా విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. అందులోనూ అన్ని రాష్ట్రాల్లో దసరాను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. భక్తులు కొన్ని రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. అందుకే ఈ పండుగలో అందరూ భాగమవుతారు. ప్రభుత్వాలు సైతం ఈ పండుగ సందర్భంగా.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. స్కూల్ పిల్లలకు సెలవులు ఇస్తారు. దేవి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని భక్తులు వివిధ రూపాల్లో అలంకరిస్తుంటారు.

Read Also: జైల్లో ఖైదీలకు మటన్ బిర్యాని.. చేపలు, రొయ్యల కూరలు.. నోరూరించే లడ్డూలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.