యాప్నగరం

కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం

బారాబజార్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు ఆ పరిసర...

Ei Samay 28 Feb 2017, 10:31 am
కోల్‌కతాలో నిన్న రాత్రి 9:30 గంటలకి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బారాబజార్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు ఆ పరిసరప్రాంతాలకి వ్యాపించాయి. బారాబజార్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో వున్న బహుళ అంతస్తుల భవనంలో రాత్రి 9:15 గంటలకి మొదటిసారి చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే అక్కడి పరిసరాలకి వ్యాపించాయి.
Samayam Telugu major fire accident at kolkatas barabazar
కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం


సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. నిన్న రాత్రి నుంచి 30 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నప్పటికీ, పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎవ్వరికీ ఏ హానీ జరగలేదు.

కోల్‌కతా నగర మేయర్ సోవొన్ చటర్జీ అక్కడే వుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది సైతం ఘటనాస్థలం వద్దే వుండి సహాయక చర్యలు చేపడుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాదం, సహాయక చర్యల కారణంగా ఎంజీ రోడ్, రవీంద్ర సారని రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.