యాప్నగరం

గంజాయిని చట్టబద్ధం చేయాలి: మేనకా గాంధీ

మాదకద్రవ్యంగా భావించే గంజాయిని వైద్య అవసరాల కోసం చట్టబద్ధం చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సూచించారు.

TNN 31 Jul 2017, 11:06 am
మాదకద్రవ్యంగా భావించే గంజాయిని వైద్య అవసరాల కోసం చట్టబద్ధం చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సూచించారు. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఇలాగే చేస్తున్నారని చెప్పారు. అమెరికాలో ఇలాంటి పద్ధతులనే అవలంభిస్తున్నారని ప్రస్తావించారు. నేషనల్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ పాలసీపై కేబినెట్ నోట్‌ను అధ్యయనం చేస్తు్న్న మంత్రుల బృందం (GOM) న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మేనకా ఈ సూచన చేశారు.
Samayam Telugu make marijuana legal for medical needs maneka gandhi
గంజాయిని చట్టబద్ధం చేయాలి: మేనకా గాంధీ


కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు చిన్న చిన్న సవరణలతో ముసాయిదాను మంత్రుల కమిటీ ఆమోదించింది. ఈ విధానం అమలుకు ఏడాదికి రూ.125 కోట్ల బడ్జెట్‌ను కమిటీ ప్రతిపాదించింది. అమెరికా వంటి పలు దేశాల్లో గంజాయిని చట్టబద్ధం చేశారని, ఇప్పుడు ఆయా దేశాల్లో దీని వినియోగం భారీగా తగ్గిపోయిందని ఈ సందర్భంగా మేనకా గాంధీ తెలిపారు. భారత్‌లో కూడా దీన్ని అమలుచేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కేన్సర్ చికిత్సకు గంజాయి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

దగ్గు తగ్గడానికి వాడే సిరప్‌లు, ఆస్తమా వంటి వాటికి వాడే కొన్ని రకాల ఇన్‌హెలెంట్స్‌ లాంటి ఫార్మాష్యుటికల్ డ్రగ్స్‌తోపాటు ఇంజెక్షన్ల అమ్మకం, వినియోగంపై మరింత నియంత్రణ అవసరమని ఆమె సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.