యాప్నగరం

ఆయన రాష్ట్రపతి ఐతే‘హిందూరాష్ట్రం’గా దేశం

ఆరెస్సె చీఫ్ మోహన్ భగవత్ ను రాష్ట్రపతి చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ కేంద్రప్రభుత్వానికి సూచించారు.

TNN 27 Mar 2017, 6:18 pm
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ను రాష్ట్రపతి చేయాలని శివసేన ఎంపీ సంజయ్ రావత్ కేంద్రప్రభుత్వానికి సూచించారు. ఆయనైతే భారత్ ను ‘హిందూరాష్ట్రం’గా మార్చి పరిరక్షిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
Samayam Telugu make rss chief mohan bhagwat president of india shiv sena mp sanjay raut
ఆయన రాష్ట్రపతి ఐతే‘హిందూరాష్ట్రం’గా దేశం


దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని అలంకరించాలంటే ఏలాంటి అవినీతి మకిలీ, ఇతరత్రా ఆరోపణలు ఉండరాదని అందుకే తాను మోహన్ భగవత్ పేరును సూచిస్తున్నామని రావత్ అన్నారు. రాష్ట్రపతి రేసులో మోహన్ భగవత్ పేరును కూడా కేంద్రప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు రావత్ పేర్కొన్నారు.

‘‘ఇండియా ‘హిందూరాష్ట్రం’గా మారాలి. రాష్ట్రపతిగా మోహన్ భగవ్ అయితే బెటర్. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలనేది ఉద్దవ్ థాక్రే నిర్ణయం తీసుకుంటారు’’ అని రావత్ చెప్పారు.

ఇదిలా ఉండగా శివ సేన అధినేత ఉద్దవ్ థాక్రేను ప్రధాని మోదీ డిన్నర్ కు ఆహ్వానించారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చించేందుకే ఈ డిన్నర్ ప్రధాన ఉద్దేశ్యం. అయితే రావత్ మాత్రం...రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఓట్లు కావాలంటే ‘మాతోశ్రీ’ (ఉద్దవ్ నివాసం) కు రావాలని..బాల్ ఠాక్రే బతికున్నప్పుడు ఎంతో మంది రాష్ట్రపతి అభ్యర్థులు అక్కడికి వచ్చారని ఆయన గుర్తు చేశారు. మాతోశ్రీలో కూడా రుచికరమైన ఆహారం ఉంటుందని చమత్కరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.