యాప్నగరం

హీరోయిన్ రేప్ కేసులో నటుడు అరెస్ట్!

ప్రముఖ సినీ నటిపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) పోలీసులు ఈరోజు...

TNN 10 Jul 2017, 9:07 pm
ప్రముఖ సినీ నటిపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులో కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) పోలీసులు ఈరోజు మళయాళం సినీనటుడు దిలీప్‌ని అరెస్ట్ చేశారు. దిలీప్ అరెస్ట్ అయినట్టుగా విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది కానీ ఇప్పటివరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మాత్రం ఈ అరెస్ట్‌పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. నటిపై అత్యాచారం కుట్రలో దిలీప్ ప్రమేయం వుందనడానికి తగిన ఆధారాలు వున్నందునే అతడిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu malayalam actor dileep arrested in an actress rape case
హీరోయిన్ రేప్ కేసులో నటుడు అరెస్ట్!


ఇదే కేసుకి సంబంధించిన విచారణలో భాగంగా గతంలోనూ దిలీప్‌తోపాటు మరో నటుడు నదిర్షాను కూడా కేరళ పోలీసులు 10 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 18న తిరుచూరు నుంచి కొచ్చికి బయల్దేరిన తనని తన వాహనంలోనే కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారని అప్పట్లో బాధిత నటి తన మాజీ డ్రైవర్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే కేరళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారణ చేపట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.