యాప్నగరం

Karnataka CM సీటుపై వీడని సస్పెన్స్.. ట్విస్ట్ ఇచ్చిన సూర్జేవాలా!

Karnataka CM: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అంశం.. కాంగ్రెస్ హైకమాండ్‌ కు ఇబ్బందిగా మారింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. రాహుల్ గాంధీ, పార్టీ సీనియర్ నేతలతో ఖర్గే చర్చలు జరుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సమయంలో.. రణదీప్ సూర్జేవాలా కీలక ప్రకటన చేశారు. దీంతో మరింత ఉత్కంఠ పెరిగింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 17 May 2023, 5:28 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక సీఎం సీటుపై కొనసాగుతున్న సస్పెన్స్
  • ఢిల్లీలోనే డీకే శివకుమార్, సిద్ధరామయ్య మకాం
  • కీలక ప్రకటన చేసిన రణదీప్ సూర్జేవాలా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu DK vs Siddaramaiah
డీకే వర్సెస్ సిద్ధరామయ్య
Karnataka CM: కర్నాటక ముఖ్యమంత్రి ఎవరా.. అని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవుతారని.. దాదాపు అన్ని మీడియా సంస్థలు జోస్యం చెప్పాయి. దీంతో బెంగళూరులో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ సమయంలో.. కర్ణాటక ఇంఛార్జ్ రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala) ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢిల్లీలో ఉన్న సూర్జేవాలా.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై స్పందించారు. 'కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కర్ణాటకలో మరో రెండు, మూడు రోజుల్లో కొత్త మంత్రివర్గం ఏర్పాటు కానుంది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నప్పుడు మేమే తెలియజేస్తాము. 48-72 గంటల్లో కొత్త మంత్రివర్గం ఏర్పాటయ్యే ఛాన్స్ ఉంది' అని రణదీప్ సింగ్ సూర్జేవాలా వివరించారు.
ఇటు సిద్ధరామయ్య సీఎం కావడం దాదాపు ఖాయమని.. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని వస్తున్న వార్తల నేపథ్యంలో.. ఆయన మద్దతుదారులు బెంగళూరులో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో.. సీఎం పదవికి సిద్ధరామయ్య పేరు ఖరారైందని కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పా అమర్‌నాథ్ ప్రకటించారు. ఆ వెంటనే.. కర్ణాటక నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవం జరగనున్న బెంగళూరులోని శ్రీ కంఠీరవ అవుట్‌డోర్ స్టేడియంలో.. పోలీసు అధికారులు తనిఖీలు చేశారు.

ఇటు డీకే శివకుమార్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసానికి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. దీంతో సీఎం సీటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు డీకే శివకుమార్ మద్దతుదారులు రోడ్ల పైకి వచ్చి.. నినాదాలు చేస్తున్నారు. డీకేను సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.