యాప్నగరం

Mamata Banerjee: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. ది కేరళ స్టోరీకి బెంగాల్‌లో బ్రేక్!

Mamata Banerjee: పశ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ది కేరళ స్టోరీ సినిమాను బెంగాల్‌లో బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 8 May 2023, 5:53 pm

ప్రధానాంశాలు:

  • బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం
  • ది కేరళ స్టోరీ మూవీని బెంగాల్‌లో బ్యాన్ చేస్తూ నిర్ణయం
  • బెంగాల్‌పై సినిమాకు బీజేపీ నిధులు ఇస్తోందని ఆరోపణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ban on The Kerala Story
ది కేరళ స్టోరీపై బ్యాన్
Mamata Banerjee: 'ది కేరళ స్టోరీ'ని నిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర సచివాలయంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాశ్మీర్ ఫైల్స్ తరహాలో బెంగాల్‌పై సినిమాకు బీజేపీ నిధులు సమకూరుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొద్ది నిమిషాలకే.. ఈ ప్రకటన వెలువడింది. ఇటు ది కేరళ స్టోరీ (The Kerala Story) ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో నడుస్తున్న స్క్రీన్‌ల నుంచి ది కేరళ స్టోరీ సినిమాను తొలగించేలా చూడాలని.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి దీదీ ఆదేశించారు. బెంగాల్‌లో శాంతిని నెలకొల్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వ్యాఖ్యానించారు. నేరాలు, హింసను ద్వేషించేలా ఉన్న వాటిని బెంగాల్‌లోకి అస్సలు అనుమతించబోమని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. శాంతిభద్రతల సమస్యలు, ప్రజల స్పందన సరిగా లేకపోవడంతో.. తమిళనాడు అంతటా ఈ సినిమా ప్రదర్శనను నిలిపేశారు. బెంగాల్ సీఎం మమతా కూడా స్టాలిన్ బాటలోనే నడిచారు.
అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కేరళలో మతపరమైన బోధన, హిందూ, క్రైస్తవ స్త్రీలను రాడికల్ ఇస్లామిక్ మతాధికారులు ఎలా టార్గెట్ చేస్తున్నారు అనే దానిపై ఈ సినిమా తీశారు. మహిళలు ఇస్లాం మతంలోకి మార్చబడ్డారని.. తరువాత ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సిరియా వంటి దేశాలకు వారిని తరలించారని ఈ సినిమా చూపించారు. ఈ సినిమాను బీజేపీ సహా.. పలు పార్టీలు సమర్థిస్తున్నాయి. పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.