యాప్నగరం

బీజేపీది తుగ్లక్ పాలన : మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ పాలనపై మండిపడ్డారు. దేశంలో తుగ్లక్ పాలన అమల్లో ఉందని అసహనం వ్యక్తం చేశారు. స్టాలిన్, హిట్లర్, నియంతల కంటే దారుణంగా పాలిస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని దీదీ అన్నారు. పెట్రోల్ ధరల తగ్గింపును ఎన్నికల వ్యూహంగా అభివర్ణించారు. కంటి తుడుపు చర్యలు ధరలను తగ్గించిందని ఆరోపించారు. అన్ని సంస్థలను బీజేపీ ధ్వంసం చేసిందని విమర్శించారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 23 May 2022, 9:15 pm

ప్రధానాంశాలు:

  • బీజేపీ పాలనపై మండిపడ్డ మమతా బెనర్జీ
  • హిట్లర్, స్టాలిన్ కంటే దారుణమైన పాలన : దీదీ
  • కేంద్ర సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్నదీదీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu బీజేపీది తుగ్లక్ పాలన : మమతా బెనర్జీ
బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలినీల కంటే దారుణంగా ఉందని విమర్శించారు. సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రం ఏజెన్సీలతో పాలన చేస్తుందని ఆక్షేపించారు. "అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, ముస్సోలినీల కంటే కాషాయ పార్టీ పాలన అధ్వాన్నంగా ఉంది." అని మమతా బెనర్జీ అన్నారు. అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కేంద్ర సంస్థలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె అన్నారు.
ఇదే సందర్భంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర సంస్థలను ఉపయోగించుకుంటోందని మమతా బెనర్జీ విమర్శించారు. అంతేకాదు తుగ్లక్ పాలన అమల్లో ఉందని ఆరోపించారు. కేంద్ర ఏజెన్సీలు స్వయంప్రతిపత్తితో పనిచేసేలా, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా నిష్ఫక్షపాతంగా పనిచేసేలా దీదీ అన్నారు. ఇదే సందర్భంలో ఎస్‌ఎస్‌సీ నియామకాలపై ప్రస్తావిస్తూ గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని వాటిని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

దేశంలో బీజేపీ తుగ్లక్ పాలన నడుపుతోందని, దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ అన్నారు. కేంద్ర ఏజెన్సీలను నియంత్రిస్తోందని విమర్శించారు. అదేవిధంగా ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడాన్ని, ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. ఉజ్వల యోజన కింద బీపీఎల్ దిగువన ఉండే కుటుంబాలకు మాత్రమే గ్యాస్ ధరను తగ్గించారని, ఇది కంటి తుడుపు చర్యేనని అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను బీజేపీ ధ్వంసం చేసిందని, తన దాడిని కొనసాగిస్తూనే ఉందని మమతా అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.