యాప్నగరం

‘మమతా బెనర్జీ మనిషి’ ముకుల్ రాజీనామా

పశ్చిమ్‌ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ముకుల్‌ రాయ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ పదివితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన సోమవారం (సెప్టెంబర్ 25) మీడియాకు..

TNN 25 Sep 2017, 5:13 pm
పశ్చిమ్‌ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ ముకుల్‌ రాయ్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన సోమవారం (సెప్టెంబర్ 25).. మీడియాకు తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌‌లో మమత తర్వాత అంతటి నేతగా, ‘మమతా బెనర్జీ మనిషి’గా గుర్తింపు పొందిన ముకుల్ రాయ్‌కు గత కొంత కాలంగా ఆమెతో పొసగడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల బీజేపీ పార్టీ నేతలతో సన్నిహితంగా మెలగుతున్నారు.
Samayam Telugu mamata banerjees man mukul roy quits trinamool after meeting with bjp leaders
‘మమతా బెనర్జీ మనిషి’ ముకుల్ రాజీనామా


ముకుల్‌ రాయ్‌ నెల రోజుల కిందట బీజేపీ అగ్ర నేతలను కలిశారు. దీంతో ఆయన ఆ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు గుప్పుమన్నాయి. కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ముకుల్‌ను టీఎంసీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు శుక్రవారమే ప్రకటించారు. అంతకుముందే ఆయణ్ని పార్టీ ఉపాధ్యక్ష హోదా, త్రిపుర టీఎంసీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు.

2015లో శారద చిట్‌ఫండ్‌ కుంభకోణంలో రాయ్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. బీజేపీ కుట్రపూరితంగా ఆయణ్ని బెదిరించి తమవైపు తిప్పుకుందని టీఎంసీ నేతలు ఆరోపించారు. ముకుల్ తన రాజీనామాకు కారణాలను మరో 5 రోజుల్లో.. దుర్గా పూజ ముగిసిన అనంతరం వెల్లడిస్తానని చెప్పారు. తదుపరి కార్యాచరణ కూడా అప్పుడే ప్రకటిస్తానని తెలిపారు.

‘ముకుల్ రాయ్‌కు పార్టీలో మమతా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నారు. అందుకే ఆయణ్ని రాజీనామా చేయాలని కోరాం. దుర్గా పూజ వరకు ఆగాల్సిన అవసరం లేదు, తక్షణమే పార్టీ పదవులకు రాజీనామా చేయాలని స్పష్టం చేశాం’ అని టీఎంసీ సెక్రటరీ పార్థ ఛటర్జీ తెలిపారు.

మరోవైపు ముకుల్ కుమారుడు సుభ్రాంగ్షు రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తిని. నేను పార్టీని వీడతాననే ప్రశ్నే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Read this in Bengali

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.