యాప్నగరం

వాటిపై దాడులు చేస్తే సొంత ఆస్తులు జప్తు!

నిరసనలు, ఆందోళనల పేరుతో ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తే ఊర్కునేది లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి

Samayam Telugu 28 Jan 2017, 12:40 pm
నిరసనలు, ఆందోళనల పేరుతో ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తే ఊర్కునేది లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులకు తెగబడేవారి నుంచి నష్టపరిహారం వసూలు చేస్తామని ఆమె తెలిపారు. దాడులు చేసి నష్టపరిహారం చెల్లించకుండా తప్పించుకొని తిరిగే వారి ఆస్తులు జప్తు చేయడానికి, జైలుకు పంపించడానికి కూడా వెనకాడబోమని ఆమె హెచ్చరించారు.
Samayam Telugu mamata benerjee says govt will make protesters pay for damaging govt property
వాటిపై దాడులు చేస్తే సొంత ఆస్తులు జప్తు!


ఈ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం కూడా రూపొందిచనున్నట్లు మమతా తెలిపారు.

రాష్ట్రం బంగ్నర్ అనే ప్రాంతంలో భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఈ నేపథ్యంలో మమతా ఆందోళనలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెచ్చగొట్టే వారి ప్రసంగాలు వినొద్దని, ఏమైనా సమస్యలుంటే తనకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.