యాప్నగరం

​ఆయనను రాష్ట్రపతిగా చేస్తామంటే.. మమత సపోర్ట్ బీజేపీకే!

భారతీయ జనతా పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన మమతా బెనర్జీ ఉన్నట్టుండి బీజేపీకి సానుకూలమైన ప్రకటనొకటి చేసింది.

TNN 24 Mar 2017, 8:33 am
నిన్నటి వరకూ భారతీయ జనతా పార్టీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించిన మమతా బెనర్జీ ఉన్నట్టుండి బీజేపీకి సానుకూలమైన ప్రకటనొకటి చేసింది. బీజేపీ ఏం చేసినా దాన్ని వ్యతిరేకిస్తాం.. అనే ధోరణి తో వ్యవహరించే దీదీ కీలకమైన ఒక విషయంలో బీజేపీకి అనుకూలమైనా మాట మాట్లాడింది. ఇది రాష్ట్రపతి ఎన్నిక విషయంలో! భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తామన్నట్టుగా హింట్ ఇచ్చింది మమత.
Samayam Telugu mamatha supports bjp in presidential elections
​ఆయనను రాష్ట్రపతిగా చేస్తామంటే.. మమత సపోర్ట్ బీజేపీకే!


అయితే కొన్ని కండీషన్లు ఉన్నాయి. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి తాము మద్దతును ఇస్తామని, అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండాల్సిన వ్యక్తి మాత్రం తాము చెప్పిన వారిలో ఎవరో ఒకరు అయ్యుండాలని అంటున్నారు దీదీ. మరి దీదీ కోరుకుంటున్న రాష్ట్రపతి అభ్యర్థి ఎవరంటే.. ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు. వీరిలో బీజేపీ ఎవరిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా తాము మద్దతునిస్తామని టీఎంసీ అధినేత్రి ప్రకటించింది.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తమ పార్టీ భీష్ముడు అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉంచాలని భావిస్తున్నారనే మాట వినిపిస్తున్న వేళ దీదీ ప్రకటన ఆసక్తికరంగా మారింది. అద్వానీని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే తాము మద్దతునిస్తామని మమత ప్రకటించారు. ఒకవేళ సుష్మాను రాష్ట్రపతిగా చేద్దామన్నా.. తమకు సమ్మతమే అని మమతా బెనర్జీ అన్నారు. వీరిద్దరూ కాకుండా.. ప్రణబ్ ముఖర్జీని మరో టర్మ్ కొనసాగిద్దామనే ప్రతిపాదన చేసినా అభ్యంతరం లేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మరి బీజేపీతో ఎడ్డెమంటే తెడ్డెం అన్నట్టుగా వ్యవహరించే మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించారు. మరి మమతే ఇలా అంటోందంటే.. అద్వానీని గనుక రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అద్వానీ అభ్యర్థిత్వం పట్ల ఏ పార్టీనీ అభ్యంతరం చెప్పకపోవచ్చేమో!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.