యాప్నగరం

RTI: లేడీ తహసీల్దార్‌కు ఎంతమంది భర్తలంటూ ఆర్టీఐకి దరఖాస్తు... దిమ్మతిరిగే జవాబు

కర్ణాటకలో ఓ వ్యక్తి ఆర్టీఐ (RTI) ద్వారా మహిళా తహసీల్దార్ వ్యక్తిగత సమాచారం కోసం ప్రయత్నించాడు. మరీ దారుణంగా ఆమెకు ఎంత మంది భర్తలు, ఎందుకు వదిలేశారు.. కల్యాణ మండపం వివరాలు, శుభలేఖ కూడా కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై ఆ మహిళా తహసీల్దార్‌ మండిపడ్డారు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తి అలాంటి ప్రశ్నలు ఎందుకు అడిగాడని.. గ్రామంలో హాట్ టాపిక్ అయింది.

Authored byAndaluri Veni | Samayam Telugu 3 Oct 2022, 3:09 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటకలో విచిత్రమైన ఘటన
  • లేడీ తహసీల్దార్ వ్యక్తిగత సమాచారంపై ఆరా
  • భర్తలు, పెళ్లిళ్లు గురించి ప్రశ్నించిన వ్యక్తి
  • పోలీసులను ఆశ్రయించిన తహసీల్దార్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu RTI activist arrested in Karnataka
RTI: సమాచార హక్కు చట్టంతో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ఎవరైనా సులభంగా పొందే అవకాశం కలిగింది. దీని ద్వారా ఎన్నో అక్రమాలు, అవినీతి కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు సామాన్యులకు ఆర్టీఐ చట్టం ఓ ఆయుధంగానే దొరికిందని చెప్పుకోవాలి. ఏ ప్రభుత్వ అధికారైనా.. అవినీతికి పాల్పడితే.. సంబంధిత సమాచారాన్ని పొంది.. వారిని నిలదీసే ఛాన్స్ దక్కింది. దీనిద్వారా ఎంతోమందికి న్యాయం కూడా జరిగింది.
ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకే ప్రభుత్వం కూడా ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇది దుర్వినియోగం అవుతుందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా ఓ వ్యక్తి సిల్లీ ప్రశ్నలు అడిగి.. అడ్డంగా బుక్కయ్యాడు. ఓ ప్రభుత్వ అధికారి వ్యక్తిగత సమాచారాన్ని అడిగాడు. దాంతో జైలు ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

పెళ్లి శుభలేఖ కావాలంటూ...

కోలారు జిల్లా ముల్‌బాగిలు తాలూకాకు చెందిన మందకల్ నాగరాజ్ అనే వ్యక్తి.. మహిళా తహసీల్దార్ వ్యక్తిగత విషయాలను కోరుతూ ఆర్టీఐకి దరఖాస్తు చేశాడు. అందులో మండల మహిళా తహసీల్దార్‌కు ఎన్నిసార్లు పెళ్లైందని, ఆమె ఎన్నిసార్లు విడాకులు తీసుకున్నారని ప్రశ్నించారు. అక్కడితో ఆగలేదు.. ప్రస్తుతం ఆమె భర్త ఎవరని, ఆమెకు పెళ్లి ఎక్కడ జరిగిందని, ఆమె వివాహ ధ్రువపత్రం, కల్యాణ మండపం వివరాలు, పెళ్లి శుభలేఖ కూడా అడిగాడు. అలాగే ఆమె గతంలో పెళ్లి చేసుకున్నవారు ఎందుకు వదిలేశారని, భర్తలు అందరూ ఆమెకు విడాకులు ఇచ్చారా.. లేదా..? అని కూడా అడిగాడు.

పిచ్చి ప్రశ్నలనుకున్న సిబ్బంది...
దరఖాస్తు చూసిన వెంటనే ఇవేం పిచ్చి ప్రశ్నలని .. కర్ణాటక కోలార్ జిల్లా ములబగిలు మండలం రెవెన్యూ కార్యాలయం సిబ్బంది ఫీలయ్యారు. సమాచార హక్కు చట్టం కింద ఇలాంటి అప్లికేషన్ కూడా పెట్టుకుంటారా..? అని ఆశ్చర్యపోయారు. కానీ తమ పని తాము చేయాల్సిందే కదా.. వెంటనే అందులోంచి తేరుకుని వారు చేయాల్సిన పని చేశారు.

అరెస్ట్ చేసిన పోలీసులు...
సమాచార హక్కు చట్టం కార్యకర్తగా ములబగిలు మండలంలో పాపులర్ అయిన నాగరాజ్ చేసిన అడిగిన ప్రశ్నలపై ఆ మహిళా తహసీల్దార్ తీవ్రంగా పరిగణించారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో నాగరాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం జుడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే స్థానికంగా ఈ విషయం సంచలనం అయింది. అసలు ఆ వ్యక్తి మహిళా తహాసీల్దార్‌ గురించి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వేసినట్టని.. చర్చించుకుంటున్నారు.

Read Also:దుర్గాదేవి విగ్రహంపై వివాదం... రాక్షసుడిగా మహాత్మాగాంధీ... ఫోటోలు వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.