యాప్నగరం

మంటగలిసిన మానవత్వం.. యూపీలో ఆటవిక న్యాయం

మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అన్నాడో సినీ కవి. నిజమే మనిషనే వాడు మాయమైపోతున్నాడు. మనం కూడా మనుషుల మధ్య జీవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు కొందరు మూర్ఖులు. తోటి మనుషుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. యూపీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు మనిషిలో ఉన్న ఆటవిక న్యాయాన్ని గుర్తు చేస్తోంది.

TNN 6 Mar 2018, 11:22 am
మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు అన్నాడో సినీ కవి. నిజమే మనిషనే వాడు మాయమైపోతున్నాడు. మనం కూడా మనుషుల మధ్య జీవిస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు కొందరు మూర్ఖులు. తోటి మనుషుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. యూపీలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు మనిషిలో ఉన్న ఆటవిక న్యాయాన్ని గుర్తు చేస్తోంది. అక్కడ పోలీస్ స్టేషన్లతో పనిలేదు... చట్టాలంటే తెలియవు. అంతా గ్రామ పెద్దల ఇష్టారాజ్యం. నేరం చేశాడో కూడా తెలుసుకోకుండా... ఓ వ్యక్తిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. మాటల్లో కూడా చెప్పలేని విధంగా అతడ్ని హింసించారు.
Samayam Telugu man attempts suicide after forced to drink urine in up
మంటగలిసిన మానవత్వం.. యూపీలో ఆటవిక న్యాయం


యూపీ సహరాన్పూర్ దగ్గరలోని ఇందిరా కాలనీకి చెందిన ఓ వ్యక్తి... అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. వెంటనే అతడ్ని పంచాయితీకి తీసుకొచ్చారు. కనీసం తప్పు చేశాడో లేదో కూడా అడగలేదు. అతడు చేసిన తప్పుకు శిక్షగా మూత్రం తాగించాలని తీర్పు ఇచ్చారు. స్థానికులంతా కలిసి అతడితో మూత్రం తాగించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించాడు. అతడ్ని దారుణంగా కొట్టి... చివరికి వదిలేశారు. తన పరువు పోయిందని భావించిన బాధితుడు ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే తాను ఎలాంటి తప్పుచేయలేదని ఆ వ్యక్తి చెబుతున్నాడు. అనవసరంగా తనపై నిందలు మోపారని... ఆ అమ్మాయి ఎవరో కూడా తనకు తెలియదంటున్నాడు. తనకు ప్రాణ భయం ఉందని... పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు... స్థానికుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని... ఎవరిదైనా తప్పని తేలితే చర్యలు తీసుకొంటామని ఎస్పీ చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.