యాప్నగరం

‘ఫ్రీడమ్ 251’ యజమాని అరెస్ట్!

‘ఫ్రీడమ్ 251’ పేరుతో రూ. 251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ఊదరగొట్టిన ‘రింగింగ్ బెల్స్’ కంపెనీ కథ మరో మలుపు తిరిగింది.

TNN 23 Feb 2017, 8:10 pm
‘ఫ్రీడమ్ 251’ పేరుతో రూ. 251కే స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని ఊదరగొట్టిన ‘రింగింగ్ బెల్స్’ కంపెనీ కథ మరో మలుపు తిరిగింది. ఆ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. ఈ మేరకు ఆయనపై ఉద్దేశపూర్వకంగా మోసం చేసినట్టు కేసు నమోదు చేసారు. ఘజియాబాద్‌కు చెందిన ‘అయామ్ ఎంటర్‌ప్రైజెస్’ యజమాని గోయల్‌పై కేసు పెట్టడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu man behind freedom 251 mobile phone detained for fraud
‘ఫ్రీడమ్ 251’ యజమాని అరెస్ట్!


ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఘజియాబాద్ డిప్యూటీ ఎస్పీ మనీష్ మిశ్రా చెప్పిన వివరాల ప్రకారం.. ఫ్రీడమ్ 251 డీలర్‌షిప్ నిమిత్తం అయామ్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి రింగింగ్ బెల్స్ సంస్థ 2015 నవంబర్‌లో రూ. 30 లక్షలు వసూలు చేసింది. అయితే రింగింగ్ బెల్స్ మాత్రం రూ. 14 లక్షలు విలువ గల ఫోన్లను మాత్రమే ఈ డీలర్‌కు అందజేసింది. మిగిలిన రూ. 16 లక్షలకు సంబంధించి ఫోన్లను ఎంతకీ పంపకపోవడం చాలాసార్లు డీలర్ రింగింగ్ బెల్స్‌ను అడిగారు. ఎంతకీ ఇవ్వక పోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

కాగా, ఫ్రీడమ్ 251 అమ్మకాలను గతేడాది ఫిబ్రవరి తమ వెబ్‌సైట్ ద్వారా రింగింగ్ బెల్స్ ప్రారంభించింది. ప్రపంచంలోనే అతితక్కువ ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ అంటూ ఊదరగొట్టింది. కానీ దీనిపై తీవ్ర ఆరోపణలు రావడంతో కంపెనీ వెనకడుగు వేసింది. ఈ ఫోన్ కోసం ఏకంగా ఏడు కోట్ల మంది రిజిస్టర్ చేసుకోవడం గమనార్హం. దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది ఈ ఫోన్‌ను బుక్‌ చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.