యాప్నగరం

ఫుడ్ బాగోలేదన్నాడని, కొట్టి చంపేసిన హోటల్ సిబ్బంది!

ఫుడ్ బాగాలేదన్నాడని ఆ హోటల్ సిబ్బంది, అతడిని తీవ్రం కొట్టి చంపేశారు.

TNN 13 Mar 2018, 6:05 pm
హోటల్‌లో ఆహారం బాగోలేకపోతే మనం యజమానికి లేదా మేనేజర్‌కు ఫిర్యాదు చేయడం సాధారణమే. అయితే, ఢిల్లీలోని ఓ యువకుడు అలా ప్రశ్నించడమే తప్పైపోయింది. అతడికి అదే చివరి ఆహారమైంది. వివరాల్లోకి వెళ్తే.. పవన్ (30) అనే వ్యక్తి తూర్పు ఢిల్లీలోని మండావలిలోని కమలా డాబాకు వెళ్లాడు. అయితే, అక్కడ వడ్డించిన ఆహారం నాణ్యంగా లేకపోవడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. మేనేజరుకు ఫిర్యాదు చేస్తానన్నాడు.
Samayam Telugu man complains about bad quality of food beaten to death by eatery staff
ఫుడ్ బాగోలేదన్నాడని, కొట్టి చంపేసిన హోటల్ సిబ్బంది!


ఈ సందర్భంగా హోటల్ సిబ్బందికి, పవన్‌కు మధ్య వాగ్వాదం చెలరేగింది. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో ముగ్గురు హోటల్ సిబ్బంది పవన్‌పై దాడి చేశారు. అందులో ఒకరు విరిగిన పెద్ద గరిటె కాడతో అతడిని చితకబాదాడు. పిడిగుద్దులు కురిపించారు. దీంతో పవన్‌కు తీవ్ర రక్తస్రావమైంది.

పవన్‌ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పవన్ చనిపోయాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఢిల్లీలో చిన్న చిన్న విషయాలకే హత్యలు చేసే ఘటనలు పెరిగాయి. గతేడాది 462 హత్య కేసులు నమోదయ్యాయంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.