యాప్నగరం

షాకింగ్: కన్నతల్లిని చంపి రక్తం తాగేశాడు

చేతబడి, క్షుద్రపూజల నెపంతో కన్నతల్లిని దారుణంగా చంపేశాడు. నిందితుడు చేసిన దారుణాన్ని చూసి వణికిపోయిన పొరుగింటి మహిళ. వారం తర్వాత ధైర్యం చేసి పోలీసులకు చెప్పింది.

Samayam Telugu 6 Jan 2019, 6:09 pm
కన్నతల్లి పాలిట కసాయిలా మారాడో కొడుకు. చేతబడి చేస్తుందని అమ్మను అనుమానించాడు. తన తండ్రి, సోదరుడి మరణానికి తల్లి కారణమని.. దారుణంగా చంపేసి ఆమె రక్తాన్ని తాగేశాడు. ఈ దారుణాన్ని చూసిన పొరిగింటి మహిళ భయంతో వణికిపోయింది. వారం తర్వాత ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారం తర్వాత ఘటన బయటపడింది.
Samayam Telugu CH


ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాకు చెందిన దిలీప్ అనే యువకుడు జులాయిగా తిరుగుతుండేవాడు. క్షుద్రపూజల పేరుతో పిచ్చి చేష్టలు చేస్తుండేవాడు. కొద్దిరోజుల క్రితం అతడి తండ్రి, సోదరుడు అనారోగ్యంతో చనిపోవడంతో.. తల్లి ఇంటి బాధ్యతను చూసుకుంటోంది. చేతబడి, క్షుద్రపూజల మాయలో పడిన దిలీప్ తన తల్లి చేతబడి చేయడం వల్లే తండ్రి, సోదరుడు చనిపోయారని బలంగా నమ్మాడు. రోజూ ఆమెను తిడుతూ.. మానసికంగా హింసించేవాడు.

డిసెంబర్ 31న ఉదయం ఓ మహిళ దిలీప్ ఇంటివైపు వెళ్లింది. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. ఇంట్లో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. అనుమానంతో తలుపు పక్కన నక్కి చూడగా.. దిలీప్ తన తల్లిని చంపి పైకి వేలాడదీశాడు. గొడ్డలితో ఆమెను నరికి.. కిందపడిన రక్తాన్ని తాగుతూ కనిపించాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి దహనం చేశాడు. ఈ ఘటనను చూసిన మహిళ భయంతో తన ఇంటికి పరుగులు తీసింది.

ఇంటికి వెళ్లిన మహిళకు భయంతో వణికిపోయింది. ఆమె మళ్లీ మామూలు స్థితికి రావడానికి రెండు రోజుల పట్టింది. తర్వాత మెల్లిగా ధైర్యం చేసి జరిగిన ఘోరాన్ని తన అల్లుడికి చెప్పగా.. అతడి సలహాతో ఇద్దరు కలిసి గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వ్యవహారం పోలీసుల దగ్గరకు చేరగా.. వారు దిలీప్ ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ కొన్ని ఎముకలతో పాటూ రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కొన్ని ఆధారాలను సేకరించారు.

తల్లిని చంపిన దిలీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్షుద్రపూజలు, చేతబడి నెపంతోనే కన్నతల్లిని కూడా దారుణంగా చంపేశాడని.. నిందితుడు ఎటువైపు నుంచి తమపై దాడి చేస్తాడోనని స్థానికులు వణికిపోతున్నారు. పోలీసు బందోబస్తు ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.