యాప్నగరం

షాక్: మహాత్ముడి ఫొటో లేకుండానే రూ. 500 నోట్లు!

దేశంలో దొంగనోట్ల బెడద ఇప్పటికీ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన కొత్తగా ఎన్నో భద్రతా ఫీచర్లతో రూ. 500, రూ.2వేల నోట్లను తీసుకొచ్చినా వాటికి దొంగ నోట్లు వచ్చేశాయి.

TNN 30 Apr 2017, 10:29 am
దేశంలో దొంగనోట్ల బెడద ఇప్పటికీ ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దుచేసిన కొత్తగా ఎన్నో భద్రతా ఫీచర్లతో రూ. 500, రూ.2వేల నోట్లను తీసుకొచ్చినా వాటికి దొంగ నోట్లు వచ్చేశాయి. నకిలీ రూ. 500, రూ. 2వేల నోట్లను ఈ మధ్య కాలంలో పట్టుకున్న కేసులో దేశవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ పొరపాటు కారణంగా కూడా ఆ మధ్య ఏటీఎంలలో కొన్ని తప్పులతో కూడిన రూ. 500, రూ. 2వేల నోట్లు వచ్చాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Samayam Telugu man receives rs 500 notes from sbi atm without mahatma gandhis image
షాక్: మహాత్ముడి ఫొటో లేకుండానే రూ. 500 నోట్లు!


అవి దొంగనోట్లో.. లేక ఆర్బీఐ ముద్రణ లోపమో.. ఏటీఎంలో డబ్బులు నింపే ఏజెన్సీ మాయో తెలియదు కాని మహాత్మగాంధీ ఫొటో లేకుండా రూ. 500 నోట్లు దర్శనమిచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని మొరేనా పట్టణంలో ఓ వ్యక్తి స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో రూ. 2వేలు డ్రా చేశారు. ఏటీఎం నుంచి నాలుగు రూ. 500 నోట్లు వచ్చాయి. అయితే వీటిపై మహాత్మగాంధీ బొమ్మలేదు. దీంతో షాక్ గురైన ఆ ఖాతాదారుడు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సంబంధిత బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీనిపై విచారణ జరుగుతోంది.
Madhya Pradesh: Man receives Rs 500 notes from SBI ATM without Mahatma Gandhi's image in Morena. (29/04) pic.twitter.com/JEDAacr9YE — ANI (@ANI_news) April 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.