యాప్నగరం

జై శ్రీరామ్ అనాల్సిందే.. ముస్లిం బిచ్చగాడిపై దాడి

రాజస్థాన్‌లో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో బిచ్చగాడిపై విరుచుకుపడ్డాడు. ఎలాంటి కారణం లేకుండానే అతడిపై పిడి గుద్దులు కురిపించాడు. ఈ వీడియో లోకల్‌గా వైరల్‌గా మారడంతో... అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరోహీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.

TNN 8 Feb 2018, 2:15 pm
రాజస్థాన్‌లో ఓ తాగుబోతు రెచ్చిపోయాడు. మద్యం మత్తులో బిచ్చగాడిపై విరుచుకుపడ్డాడు. ఎలాంటి కారణం లేకుండానే అతడిపై పిడి గుద్దులు కురిపించాడు. ఈ వీడియో లోకల్‌గా వైరల్‌గా మారడంతో... అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సిరోహీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. సిరోహీలో సలీమ్ అనే బిచ్చగాడు రోడ్డు పక్కన యాచిస్తున్నాడు. ఇదే సమయంలో పాలీలో ఉండే వినయ్‌కుమార్ అనే వ్యక్తి అటుగా వచ్చాడు. వచ్చీ రావడంతోనే అతడిపై దాడి చేశాడు. ఎందుకు కొడుతున్నావు అని అతడు అడిగా... వినకుండా మీదపడి కొట్టాడు. అయితే వినయ్ పక్కకు వెళ్లినట్లు వెళ్లి... మళ్లీ వచ్చి సలీమ్‌ను కొట్టాడు. జై శ్రీరామ్ అంటావా లేదా అంటూ బెదిరించాడు. బాధితుడు భయంతో వణికిపోవడంతో శాంతించాడు. ఈ ఘటన జరిగే సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేరట.
Samayam Telugu man slaps muslim beggar forces him to chant jai shri ram
జై శ్రీరామ్ అనాల్సిందే.. ముస్లిం బిచ్చగాడిపై దాడి


వినయ్ ఈ తతంగం మొత్తాన్ని తనే మొబైల్‌లో రికార్డ్ చేసుకున్నాడు. అలాగే ఇంటికెళ్లి తాగిన మత్తులో వీడియోను ఫ్రెండ్స్‌కు షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు ఆరా తీసి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సలీమ్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో వినయ్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై ముస్లిం సంఘాలు కూడా ఫిర్యాదు చేశాయి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. వినయ్‌కు సలీమ్‌తో గతంలోనే పరిచయం ఉందట. ఈ విషయం తెలుసుకొని పోలీసులు కూడా షాకరయ్యారు. ఇద్దరు కలిసి గతంలో ఎన్నోసార్లు మద్యం కూడా సేవించారట. మరోవైపు ఈ ఘటనపై వినయ్‌ స్పందించాడు. తాను తప్పు చేశానని.. క్షమించాలంటూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.