యాప్నగరం

గోవా సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణం

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు.

TNN 14 Mar 2017, 6:01 pm
గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ మృదుల సిన్హా మంగళవారం సాయంత్రం పారికర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక భాష అయిన కొంకణిలో పారికర్ ప్రమాణం చేశారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణం చేశారు. పనాజీలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రలు వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గోవా మాజీ సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ హాజరయ్యారు.
Samayam Telugu manohar parrikar takes oath as goa chief minister
గోవా సీఎంగా మనోహర్ పారికర్ ప్రమాణం


కాగా, గోవా ముఖ్యమంత్రిగా పారికర్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో గెలిచిన చిన్నపార్టీలు గోవా ఫార్వార్డ్, ఎంజీపీతోపాటు స్వతంత్ర అభ్యర్థులతో కలసి బీజేపీ గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈరోజు ప్రమాణం చేసిన ఎనిమిది మంది కేబినెట్ మంత్రుల్లో బీజేపీ నుంచి ఇద్దరే ఉండడం విశేషం. గోవా ఫార్వార్డ్ అధినేత విజయ్ సర్దేశాయికి కేబినెట్ స్థానం కల్పించారు. అలాగే ఎంజీపీ అభ్యర్థి సుదిన్ ధవళికర్ కూడా మంత్రి పదవి పొందారు. ఇదిలా ఉండగా, పారికర్ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది.

గోవాలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి మెజారిటీ సీట్లు 21 ఉండాలి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ 13 సీట్లు గెలుచుకుంది. బీజేపీతో జతకలసిన గోవా ఫార్వార్డ్, ఎంజీపీ చెరో మూడు సీట్లు గెలుచుకున్నాయి. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ వెంటే ఉన్నారు. కాబట్టి గోవాలో బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.