యాప్నగరం

పాఠశాల విద్యార్థినులకు రుతుస్రావ సమస్యపై మానుషీ పాఠాలు

మానుషీ చిల్లార్ ‘వ్యక్తిగత శుభ్రతపై మహిళలకు అవగాహన’ కార్యక్రమం కొనసాగిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాల విద్యార్థులకు రుతుస్రావ సంబంధ సమస్యలు, న్యాప్‌కిన్ల వాడకంపై వివరించింది.

TNN 8 Feb 2018, 12:15 am
ప్రపంచ సుందరి 2017, హరియాణా అందగత్తె మానుషీ చిల్లార్ ‘వ్యక్తిగత శుభ్రతపై మహిళలకు అవగాహన’ కార్యక్రమం కొనసాగిస్తోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాల విద్యార్థులకు రుతుస్రావ సంబంధ సమస్యలు, న్యాప్‌కిన్ల వాడకంపై వివరించింది. వారి సందేహాలను నివృత్తి చేసింది. దేశంలో ఇప్పటికీ నిరుపేద కుటుంబాలకు చెందిన చాలా మంది అమ్మాయిలకు రుతు సంబంధ అంశాలపై సరైన అవగాహన లేదని, ఆధునిక కాలంలోనూ చాలా మంది మహిళలకు శానిటరీ న్యాప్‌కిన్లు, ప్యాడ్ల వాడకం గురించి తెలియదని మానుషీ చెప్పుకొచ్చింది.
Samayam Telugu manushi chhillar meets schoolgirls calls for making menstrual hygiene a priority
పాఠశాల విద్యార్థినులకు రుతుస్రావ సమస్యపై మానుషీ పాఠాలు


‘ఆ విషయం గురించి చెప్పుకోడానికి మహిళలు ఇప్పటికీ సిగ్గుపడుతున్నారు. ఆ క్లిష్ట సమయాల్లో బాలికలు పాఠశాలకు వెళ్లడం మానేస్తున్నారు. మహిళలు పని మానేసి ఇంటి పట్టునే ఉంటున్నారు. స్త్రీల విషయంలో ఇదొక అత్యంత సాధారణ విషయమని గుర్తిస్తే.. చాలా మార్పు వస్తుంది’ అని మానుషీ పేర్కొంది.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ‘హెచ్‌ఐసీసీ’ వేదికగా ఫిబ్రవరి 1న ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభమైంది. ‘ఫెమినైన్ హైజీన్ అవేర్‌నెస్’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో మానుషీ చిల్లార్, మిస్ వరల్డ్ 2016 స్టెఫ్నీతో పాటు 5 దేశాల సుందరీమణులు కూడా పాల్పంచుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.