యాప్నగరం

కులాంతర వివాహం.. రూ.2.5లక్షలు ప్రోత్సాహం

కులాంతర వివాహం చేసుకుంటే దంపతులకి అందజేసే ఆర్థిక ప్రోత్సాహ పథకంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక మార్పు

TNN 7 Dec 2017, 9:14 am
కులాంతర వివాహం చేసుకుంటే దంపతులకి అందజేసే ఆర్థిక ప్రోత్సాహ పథకంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక మార్పు చేసింది. దంపతుల్లో ఒకరు దళితులై ఉంటే.. వార్షికాదాయంతో సంబంధం లేకుండా ఇకపై రూ.2.5లక్షల్ని అందజేయనుంది. 2013 నాటి సామాజిక సమగ్రత.. డాక్టర్ అంబేద్కర్ పథకంలో వార్షికాదాయం రూ.5లక్షలకి మించని వారికి మాత్రమే ఈ ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందజేసేది. కానీ.. తాజాగా ఈ వార్షికాదాయ పరిమితిని నిబంధనని కేంద్ర ప్రభుత్వం తొలగించింది.
Samayam Telugu marry a dalit get rs 2 5 lakh modi government tweaks old scheme to encourage inter caste marriage
కులాంతర వివాహం.. రూ.2.5లక్షలు ప్రోత్సాహం


కులాంతర వివాహం చేసుకున్న దంపతులు ప్రభుత్వం నుంచి ఈ ప్రోత్సాహకాన్ని పొందాలంటే వారి వివాహాన్ని ‘హిందూ వివాహ చట్టం (1955)’ ప్రకారం తప్పనిసరిగా నమోదు చేయాలి. కులభేదాలను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కులాంత వివాహాల్ని ప్రోత్సహిస్తూ ఈ ప్రోత్సహాకాల్ని అందజేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.