యాప్నగరం

మాయావతికి మిగిలిన ఆ హోదా కూడా హుష్ కాకి?

మాయవతికి మాత్రం ఓట్లు పడ్డా సీట్లు రాలేదు.దీంతో ఒకరకంగా ఆమె దిగ్భ్రమకు లోనయ్యారు. మరి ఇప్పుడు ఆమెకు మరో షాక్ ఏమిటంటే..

TNN 13 Mar 2017, 2:21 pm
తాజాగా ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికలు బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి పీడకలే అని వేరే చెప్పనక్కర్లేదు. కేవలం 19 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీఎస్పీ విజయం సాధించగలిగింది. 403 అసెంబ్లీ స్థానాలకు గానూ పోటీ చేస్తే... దక్కింది కేవలం ఐదో శాతం సీట్లే. గత ఐదేళ్లలో యూపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగిన బీఎస్పీకి బీజేపీ హవాలో ఈ చేదు అనుభవం తప్పలేదు. ఇక్కడ మరింత విచిత్రం ఏమిటంటే.. ఓట్ల శాతం విషయంలో బీఎస్పీ పరిస్థితి బాగానే ఉంది.
Samayam Telugu maya have no chances to relect to rs
మాయావతికి మిగిలిన ఆ హోదా కూడా హుష్ కాకి?


22 శాతం ఓట్లను పొందింది మాయవతి పార్టీ. ప్రతి వంద ఓట్లలోనూ 22 ఓట్లను మాయవతి పార్టీ సింగిల్ గా సొంతం చేసుకుంది. అయితే.. సీట్ల సంఖ్య విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్ లో ఉంది. 22 శాతం ఓట్లను పొందినా కేవలం 19 అసెంబ్లీ సీట్ల కు పరిమితం అయ్యింది. బీఎస్పీ కన్నా తక్కువ శాతం ఓట్లను పొందిన ఎస్పీ 47 స్థానాల్లో విజయం సాధించగా, మాయవతికి మాత్రం ఓట్లు పడ్డా సీట్లు రాలేదు.

దీంతో ఒకరకంగా ఆమె దిగ్భ్రమకు లోనయ్యారు. మరి ఇప్పుడు ఆమెకు మరో షాక్ ఏమిటంటే.. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం కూడా కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్ల కిందట యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఓటమి పాలయ్యాకా.. మాయ రాజ్యసభకు వెళ్లిపోయారు. యూపీ అసెంబ్లీకి కాకుండా.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరి మరో ఏడాదిలో మాయ రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియనుంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం యూపీలో బీఎస్పీకి ఉన్న బలం ప్రకారం చూస్తే.. ఆ బలం మాయ తిరిగి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యేందుకు సరిపోదు.

దీంతో మాయ ఎలాంటి చట్టసభలోనూ సభ్యురాలు కాకుండా పోతారు. ఇంకో ఏడాది దానికి గడువు ఉంది. అయితే ఆ తర్వాతి ఏడాది ఎలాగూ లోక్ సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి.. మాయ అప్పుడు యూపీ నుంచే ఏదైనా ఎంపీ సీటుకు పోటీ చేయవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.