యాప్నగరం

డిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

వరసగా మూడోసారి డిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది.

TNN 26 Apr 2017, 1:20 pm
డిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. వరసగా మూడోసారి డిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం మూడు కార్పొరేషన్లలోని మొత్తం 270 వార్డులకు ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తూర్పు డిల్లీ కార్పొరేషన్‌లోన 64 స్థానాలకు 40, ఉత్తర డిల్లీలోని 104 స్థానాలకు 71, దక్షిణ డిల్లీ కార్పొరేషన్‌లోని 104 స్థానాలకు 68 స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగరవేసింది. వీటిలో రెండు స్థానాల్లో అభ్యర్థుల మృతి కారణంగా ఫలితాలను వాయిదా వేశారు.
Samayam Telugu mcd election results 2017 bjp sweeps
డిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం


ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. గత పదేళ్లుగా ఎంసీడీలో బీజేపీనే అధికారంలో ఉండటం విశేషం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి బీజేపీ ఓట్ల శాతం కూడా పెరిగింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజధాని డిల్లీలో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన కోల్‌కతాలో మీడియాతో మాట్లాడారు. మోడీ పాలనకు ప్రజలు పట్టం కట్టారని, రెండేళ్ల ఆప్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.