యాప్నగరం

డిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రాజీనామా!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ..

TNN 26 Apr 2017, 12:54 pm
ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక పార్టీలో ఎలాంటి బాధ్యతలు తీసుకొనని, సాధారణ కార్యకర్తగానే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 181 స్థానాల్లో ముందంజలో ఉంది. ఆప్ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ చివరి స్థానంలో కొనసాగుతున్నాయి. ఎన్నికల పూర్తి స్థాయి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Samayam Telugu mcd elections 2017 ajay maken resigns as delhi congress chief
డిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రాజీనామా!


మరోవైపు బీజేపీ పార్టీ విజయానికి సంబంధించి తాము ఎలాంటి సంబరాలు నిర్వహించబోమని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకానికి 25 మంది జవాన్లు మృతి చెందిన నేపథ్యంలో.. వారి త్యాగాలకు ఈ విజయాన్ని అంకింతం ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను మనం గౌరవించాలి అని ఆయన పేర్కొన్నారు.

‘ఎన్నికల ఫలితాల్లో విజయంపై మాకెంతో సంతోషంగా ఉంది. డిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు. కేజ్రీవాల్‌ నాయకత్వాన్ని డిల్లీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ఆయన డిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని మనోజ్‌ తివారి అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.