యాప్నగరం

మైనర్ బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్టు

లైంగిక దాడి కేసులో మేఘాలయ స్వతంత్ర ఎమ్మెల్యే జూలియస్‌ డార్పాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.

Samayam Telugu 7 Jan 2017, 11:32 am
లైంగిక దాడి కేసులో మేఘాలయ స్వతంత్ర ఎమ్మెల్యే జూలియస్‌ డార్పాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. 14ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై ఇప్పాటికే ఆ రాష్ట్ర హోంమంత్రి కుమారుడితో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది తనను గెస్ట్ హౌస్‌కు పిలిపించి అత్యాచారం చేశారంటూ బాధిత బాలిక ఫిర్యాదు చేసింది.
Samayam Telugu meghalaya mla accused of raping minor girl arrested in guwahati
మైనర్ బాలిక రేప్ కేసులో ఎమ్మెల్యే అరెస్టు

ఎమ్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఆయన కనిపించకుండా పోయారు. దీంతో ఎమ్మెల్యే కోసం పోలీసులు లుక్‌ అవుట్‌ జారీ చేసి ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యేను గౌహతిలోని గర్ చుక్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో అస్సాం, మేఘాలయ పోలీసులు పాల్గొన్నారు.

జూలియస్‌ డార్పాంగ్‌ గతంలో నిషేదిత హైన్నివట్రప్ నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ కు నాయకత్వం వహించారు.
మైనర్ బాలికను రేప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జూలియస్‌ డార్పాంగ్‌ను అరెస్టు చేయాలని జనవరి 4 స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ వారంటు జారీ చేసింది.

అరెస్టు చేసిన జూలియస్‌ డార్పాంగ్‌ను షిల్లాంగ్‌లోని సదర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కాగా జూలియస్‌ డార్పాంగ్‌ మౌహతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే అయిన ఆయన రూలింగ్‌ పార్టీ కాంగ్రెస్‌ కు మద్దతు ఇస్తున్నారు. లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.