యాప్నగరం

బీజేపీవీ అబద్దపు ప్రచారాలు: మెహబూబా

తనపై బీజేపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. పీడీపీ- బీజేపీ అలయన్స్ అజెండా రూపకల్పనలో రామ్ మాధవ్, రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నట్లు ఆమె తెలిపారు.

Samayam Telugu 24 Jun 2018, 6:42 pm
తనపై బీజేపీ నేతలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. పీడీపీ- బీజేపీ అలయన్స్ అజెండా రూపకల్పనలో రామ్ మాధవ్, రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నట్లు ఆమె తెలిపారు. ఆర్టికల్ 370పై స్టేటస్ కో, పాకిస్థాన్, హురియత్ కాన్ఫరెన్స్ లతో చర్చల విషయం అజెండా అలయన్స్‌లో ఉందన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తన జమ్మూ పర్యటన సందర్భంగా.. శనివారం (జూన్ 23) పీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో.. అమిత్ షా మాటలకు కౌంటర్‌గా ఆమె ఆదివారం (జూన్ 24) వరుస ట్వీట్లు చేశారు. అలయన్స్ అజెండాను తామెన్నడూ పక్కనబెట్టలేదని.. బీజేపీనే దూరం జరిగిందని ఆరోపించారు ముఫ్తీ.
Samayam Telugu Mehbooba Mufti


జమ్మూ నుంచి బీజేపీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారని.. వారి సామర్థ్యాన్ని ఆ పార్టీ సమీక్షించుకోవాలని ఆమె పేర్కొంది. జర్నలిస్టు హత్య నేపథ్యంలో భాపప్రకటనా స్వేచ్ఛపై బీజేపీ వ్యాఖ్యలను మెహబూబా ముఫ్తీ ఎద్దేవా చేశారు. కథువా లైంగిక దాడి కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఇప్పటికీ జర్నలిస్టులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు మెహబూబా ముఫ్తీ ఆరోపణలకు బీజేపీ నేతలు కూడా అదే రీతిలో స్పందించారు. అలయన్స్ అజెండాను పీడీపీ విచ్ఛిన్నం చేసిందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు ఏం చేశారో చెప్పాలని ముఫ్తీని నిలదీశారు.

ఇదిలా ఉండగా బీజేపీ, పీడీపీ పరస్పర విమర్శలను మాజీ సీఎం ఒమర్‌ అబ్ధుల్లా ఆక్షేపించారు. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని, బాలీవుడ్‌ సినిమాలను మరిపించే స్క్రిప్టులతో రక్తి కట్టిస్తున్నాయని విరుచుకుపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.