యాప్నగరం

ఇంటికి 30 కి.మీ దూరంలో వలస కూలీ మృతి.. పరీక్షలో షాక్

యూపీకి చెందిన ఓ వలస కార్మికుడు స్వస్థలానికి వెళ్లడానికి 1600 కి.మీ. ప్రయాణించి ట్రక్కులోనే కుప్పకూలి మరణించాడు. ఇంటికి 30 కి.మీ. దూరంలో మరణించిన అతడికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళన కల్గిస్తోంది.

Samayam Telugu 14 May 2020, 9:49 pm
రోనా మహమ్మారి మనిషి జీవితాన్ని తలకిందులు చేస్తోంది. వలస కార్మికులు, కూలీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌తో బతుకుదెరువు చిన్నాభిన్నమై స్వస్థలాల బాటపట్టిన వలస కార్మికుల్లో కొంత మంది ఇంటికి కూతవేటు దూరంలో విషాదకర రీతిలో మృత్యువాతపడుతున్నారు. రోడ్డు, రైలు ప్రమాదాల రూపంలో ఇప్పటికే పలువురు వలస కార్మికులను మృత్యువు కబళించగా.. యూపీకి చెందిన మరో కార్మికుడు ట్రక్కులో 1600 కి.మీ. దూరం ప్రయాణించిన తర్వాత కుప్పకూలి మరణించాడు. చనిపోయిన తర్వాత అతడికి కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగించే అంశం.
Samayam Telugu నమూనా చిత్రం
Migrant death


ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌కు చెందిన 68 ఏళ్ల రామ్ క్రిపాల్ అనే వ్యక్తి ముంబైలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో కంపెనీ మూతబడటంతో ఉపాధి కరువైంది. ఇన్ని రోజులు ముంబైలోనే ఉండిపోయిన రామ్‌ క్రిపాల్.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో 4 రోజుల కిందట ఇంటికి బయల్దేరాడు. స్వస్థలానికి బయల్దేరడానికి అతడికి ఓ ట్రక్కు మార్గం చూపింది.

ట్రక్కులో నాలుగు రోజుల పాటు 1600 కి.మీ. ప్రయాణించిన రామ్ క్రిపాల్.. మరో 30 కి.మీ. ప్రయాణిస్తే స్వగ్రామం చేరుకుంటాడనగా అస్వస్థతకు గురయ్యాడు. ట్రక్కులోనే సృహ తప్పి కిందపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్దారించారు. ఆ తర్వాత అతడికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు ట్రక్‌లో అతడు కాంటాక్ట్ అయిన వారి వివరాలను గుర్తించే పనిలో పడ్డారు.

అంత్యక్రియల్లో కుమారుడు


Photo Credit: ThePrint

Also Read: మా పేషెంట్ పరిస్థితి ఏంటి.. అంత్యక్రియలు పూర్తి చేశాం!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.