యాప్నగరం

Tamil Nadu: కంట్లో త్రివర్ణ పతాకం పెయింటింగ్... 16 సార్లు ప్రయత్నించి చివరిగా..

తమిళనాడులోని (Tamil Nadu) కోయంబత్తూరులో ఓ కళాకారుడు భిన్నంగా ఆలోచించాడు. జాతీయ జెండాపై తనకున్న అభిమానాన్ని చాలా వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా తన కుడి కంట్లో జాతీయ జెండా బొమ్మను పెయింట్ వేసుకున్నాడు. దీని కోసం 16 సార్లు ప్రయత్నించి.. 20 నిమిషాలు పాటు కష్టపడి వేసుకున్నాడు. అయితే తనలాగా మిగతావారు చేయవద్దని వేడుకుంటున్నాడు. డాక్టర్లు కూడా ఇలా చేయడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కంటికే హాని జరిగే అవకాశం ఉంటుందన్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 9 Aug 2022, 4:48 pm

ప్రధానాంశాలు:

  • తమిళనాడులో ఓ కళాకారుడి వినూత్న యత్నం
  • కుడి కంట్లో జాతీయ జెండా పెయింటింగ్
  • ప్రమాదమంటూ హెచ్చరిస్తున్న డాక్టర్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Flag
Tamil Nadu: 75వ స్వతంత్ర దినోత్సవానికి దేశం సిద్ధమైంది. ఒక వారంలో ఆగస్ట్ 15 రాబోతుంది. ఈ క్రమంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా మొబైల్ ఫోన్స్‌లో ప్రొఫైల్ పిక్స్‌గా మన జాతీయ జెండాలను పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దాంతో చాలామంది తమ ఫేస్‌బుక్, వాట్సాప్ ప్రొఫైల్ పిక్స్‌గా జెండాలను పెట్టుకున్నారు. అయితే తమిళనాడుకు చెందిన ఓ కళాకారుడు దీనికి భిన్నంగా ప్రయత్నించారు. మన త్రివర్ణ పతాకం పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను వినూత్నంగా చాటుకుని సంచలనం సృష్టించారు. కోయంబత్తూరుకు చెందిన రాజా (52) అనే వ్యక్తి తన కుడి కంట్లో త్రివర్ణ పతాక బొమ్మను చిత్రించుకున్నారు. వృత్తి రీత్యా స్వర్ణకారుడైన రాజా.. గతంలో అనేక సూక్ష్మ చిత్రాలను రూపొందించారు.
తాజాగా మన స్వతంత్ర ఉద్యమం గురించి అవగాహన కల్పించేందుకు తన కంట్లో జాతీయ జెండాను చిత్రించుకున్నారు. అయితే త్రివర్ణ పతాకాన్ని కంట్లో వేసుకోవడానికి గుడ్డులోని తెల్లసొన మిశ్రమాన్ని ఉపయోగించారు. అద్దం చూసుకుని స్వయంగా కంట్లో పెయింటింగ్ వేసుకున్నట్టు రాజా చెప్పారు. అయితే తన చూపును అద్దంవైపు ఉంచడానికి కష్టమైందని తెలిపారు. అలా 16 సార్లు ప్రయత్నించిన తర్వాత కంట్లో త్రివర్ణ పతాకాన్ని పూర్తిగా.. కరెక్టుగా చిత్రించుకోగలిగానని తెలిపారు. పెయింట్ పూర్తి చేయడానికి 20 నిమిషాలు పట్టిందన్నారు. అయితే తనలా ఎవరూ చేయవద్దని ఆయన హితవు పలికారు.

కంట్లో పెయింటింగ్ వేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు కూడా అంటున్నారు. ఇలాంటి చర్యలు కచ్చితంగా కంటికి హాని చేస్తాయని చెప్పారు. త్రివర్ణాన్ని గీయడానికి ఉపయోగించిన పదార్థాలు అలెర్జీలు, కంటి దురదను కలిగించవచ్చని తెలిపారు. పెయింటింగ్‌ వేసుకునే క్రమంలో కంటికి తీవ్రమైన ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. కాగా ఇటీవల ఓ యువకుడు తన కంటికి టాటూ వేయించుకోవడంతో చూపు కోల్పోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.