యాప్నగరం

ఇండియాలో బికినీ వేసుకోవద్దు: కేంద్రమంత్రి

ఇది వరకూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదాస్పద తీరుతో వార్తల్లో నిలిచిన కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 16 Mar 2018, 10:37 am
ఇది వరకూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో, వివాదాస్పద తీరుతో వార్తల్లో నిలిచిన కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కేరళకు చెందిన ఈ బీజేపీ నేత విదేశీ టూరిస్టులకు ఇప్పుడొక సూచన చేశారు. వస్త్రధారణ విషయంలో భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని ఈయన అన్నారు. విదేశీయులే అయినా మహిళలు బికినీలు వేసుకుని ఇండియాలో సంచరించకూడదని ఈ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. గోవా బీచ్ ల లాంటి చోట బికినీలు వేసుకుని తిరిగితే తిరగండి కానీ.. మిగతా చోట్ల మాత్రం సంప్రదాయబద్ధమైన బట్టలు వేసుకోవాలని ఆయన అన్నారు. అలాగని చీరలు కట్టుకుని తిరగాలని తను అనడం లేదని.. సంప్రదాయానికి అనుగుణంగా ఉండాలని ఈ మంత్రిగారు సూచించారు. లాటిన్ అమెరికా దేశాల్లో బికినీలు వేసుకుని మహిళలు రోడ్లపై తిరుగుతూ ఉంటారని, ఇండియాలో అలా కుదరదు అని ఆయన అన్నారు.
Samayam Telugu minister kj alphons has advice on bikinis
ఇండియాలో బికినీ వేసుకోవద్దు: కేంద్రమంత్రి


ఇది వరకూ ఇండియాలో బీఫ్ తినొద్దు అని విదేశీ టూరిస్టులకు అల్ఫోన్స్ సూచించారు. బీఫ్ తినాలని అనుకుంటే.. విదేశాల్లో తిని రావాలని.. ఇండియాలో మాత్రం తినొద్దు అని వ్యాఖ్యానించారు. దీనిపై అప్పట్లో పలువురు ధ్వజమెత్తారు. ఏం తినాలో, ఏం తినకూడదో మీరెలా చెబుతారు? అని మంత్రిని ప్రశ్నించారు.

ఇక ఇప్పుడు కూడా ఈ తరహా వ్యాఖ్యలు తప్పడం లేదు. ఒకవైపు సినిమాల్లో హీరోయిన్లు బికినీలతో మెరుస్తూ ఉన్నారు. బీచ్ లలో, స్టార్ హోటళ్ల స్విమ్మింగ్ పూల్స్ వద్ద బికినీలు కామనే.. ఇక రోడ్ల మీద బికినీలు వేసుకుని తిరిగే వాళ్లు అయితే దాదాపుగా ఉండరు. ఇలాంటి నేపథ్యంలో మంత్రిగారు అనవసరమైన సూచనలు చేశారని.. కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.