యాప్నగరం

మిషన్ కర్మయోగి: సివిల్ సర్వీసెస్ ప్రక్షాళన.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Union Cabinet: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సివిల్ సర్వీసెస్‌ను ప్రక్షాళన చేయనున్నారు. ఇందుకోసం మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.

Samayam Telugu 2 Sep 2020, 6:37 pm
సివిల్ సర్వీసుల ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మిషన్‌ కర్మయోగి’ పేరిట సివిల్‌ సర్వీసుల ప్రక్షాళనకు మోదీ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. సివిల్‌ సర్వీసుల సామర్థ్యం పెంపు కోసం జాతీయ కార్యక్రమంగా మిషన్‌ కర్మయోగిని ప్రభుత్వం చేపడుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ తెలిపారు. బుధవారం (సెప్టెంబర్ 2) సాయంత్రం ఢిల్లీలో ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
Samayam Telugu ప్రకాశ్ జవదేకర్
Prakash Javadekar on Union cabinet decissions


సివిల్ సర్వెంట్లు మరింత సృజనశీలురుగా, నిర్మాణాత్మకంగా, చురుకుగా, పారదర్శకంగా ఉండేలా మిషన్‌ కర్మయోగిని రూపొందిస్తున్నామని మంత్రి జవదేకర్ చెప్పారు. దేశ భవిష్యత్‌ కోసం వారిని దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ మిషన్‌‌ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. అధికారులు మరింత ఉత్తేజంగా, సాంకేతిక అంశాలపై పట్టు సాధించేలా ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అని ఆయన వివరించారు. న్యూ ఇండియా నిర్మాణంలో భాగంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలిపారు.

జమ్ము కశ్మీర్‌లో డోంగ్రి, కశ్మీరీ, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ను అధికార భాషలుగా గుర్తించే బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జపాన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌తో జౌళి శాఖ, గనులు, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖలు ప్రతిపాదించిన మూడు ఎంఓయూలకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని మంత్రి జవదేకర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.