యాప్నగరం

MK Stalin: డీఎంకే నూతన అధ్యక్షుడి ఎన్నిక పూర్తి!

కరుణానిధి అస్తమయం అనంతరం ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన తనయుడు ఎంకే స్టాలిన్.

Samayam Telugu 28 Aug 2018, 11:44 am
కరుణానిధి అస్తమయం అనంతరం ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆయన తనయుడు ఎంకే స్టాలిన్. ఈ మేరకు డీఎంకే కార్యవర్గం మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆదివారం జరిగిన సమావేశంలో అధ్యక్ష పదవికి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కేవలం స్టాలిన్ మాత్రమే ఆ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. మరో నామినేషన్ ఏదీ దాఖలు కాలేదు. దీంతో స్టాలిన్ ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నికయ్యారు.
Samayam Telugu stalin-kanimozhi


ఈ విషయాన్ని డీఎంకే అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం అధికారికంగా స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడు అయినా.. ఈ బాధ్యతలు మాత్రం ఆయన చాలా రోజులుగానే చూస్తున్నారు. కరుణానిధి అనారోగ్యంతో చాన్నాళ్లుగా ఈ బాధ్యతలకు దూరం అయ్యారు. ఆ సమయంలో స్టాలిన్ అనధికార అధ్యక్షుడిగా వ్యవహరించారు. ‘వర్కింగ్ ప్రెసిడెంట్’హోదాలో స్టాలిన్ ఈ బాధ్యతల్లో ఉన్నారు.

కరుణానిధి మరణంతో ఇప్పుడు స్టాలిన్‌కు పూర్తి స్థాయిలో పగ్గాలు దక్కాయి. ప్రస్తుతం స్టాలిన్ వయసు 65 సంవత్సరాలు. డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆ పార్టీ తరఫు ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా స్టాలిన్ ఖరారు అయినట్టే. అయితే పార్టీలో స్టాలిన్ ఆధిపత్యాన్ని ఆయన సొంత సోదరుడు అళగిరి ప్రశ్నిస్తూ వస్తున్నారు. తనపై బహిష్కరణను ఎత్తివేయాలని..తనను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని లేకపోతే కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో నిలుస్తానని అళగిరి హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.