యాప్నగరం

మహారాష్ట్ర ఎమ్మెల్యే దురుసుతనం

మహారాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగిపై స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు దాడికి పాల్పడి అనుచితంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదం రేపింది

TNN 30 Mar 2016, 9:11 pm
మహారాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగిపై స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు దాడికి పాల్పడి అనుచితంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర వివాదం రేపింది. తమ ఉద్యోగిపై దాడికి నిరసనగా సచివాలయం ఉద్యోగులు విధులను బహిష్కరించి తమ కార్యాలయాల నుండి వెలుపలకు వచ్చారు. తమ తోటి ఉద్యోగిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేసారు.
Samayam Telugu mla assaults mantralaya official
మహారాష్ట్ర ఎమ్మెల్యే దురుసుతనం


మంగళవారం మధ్యాహ్నం స్వతంత్ర ఎమ్మెల్యే ఓంప్రకాశ్ బాబారావ్ అలియాస్ బచ్చు కాడు సచివాలయానికి వచ్చారు. సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటులో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న బిఆర్ గవీత్ తో ఆయనకు వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే సంయమనం కోల్పోయి అతనిపై దాడికి దిగారు. ఈ ఘటనలో గవీత్ గాయాలపాలే ఆస్పత్రి పాలయ్యారు. దాంతో ఉద్యోగవర్గాలు ఆగ్రహించి విధులను బహిష్కరించడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. పోలీసులు సచివాలయంలోని వీడియో పుటేజీ ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.