యాప్నగరం

స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన శరవణన్ మాట మారింది

తమిళనాడు అధికారపీఠాన్ని చేజిక్కించుకునేందుకు జరిగిన బలపరీక్షలో ఓటు వేసేందుకు ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన...

TNN 13 Jun 2017, 10:28 pm
తమిళనాడు అధికారపీఠాన్ని చేజిక్కించుకునేందుకు జరిగిన బలపరీక్షలో ఓటు వేసేందుకు ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆమె నుంచి భారీ మొత్తంలో ముడుపులు అందుకున్న వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్‌కి చెందిన టైమ్స్ నౌ న్యూస్ ఛానెల్ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయిన శాసనసభ్యుల తీరుపై తమిళ ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.
Samayam Telugu mla saravanan says that tone in video is not belonged to him
స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన శరవణన్ మాట మారింది


ఈ స్టింగ్ ఆపరేషన్ వీడియో రాష్ట రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నా.. అధికారపార్టీకి చెందిన నేతలు ఎవ్వరూ దీనిపై స్పందించే సాహసం చేయడం లేదు. ఎమ్మెల్యేలని కొనుగోలు చేసేందుకు ఒక్కో ఎమ్మెల్యేకి కోటి రూపాయలు ఇవ్వజూపారనే ఆరోపణలు ఎదుర్కుం‌టున్న మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం సైతం దీనిపై పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు.

ఇదిలావుంటే, టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్‌లో మీడియాకు అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే శరవణన్ మాత్రం ఆ టేపులో వున్న గొంతు తనది కాదు అని కొట్టిపారేశారు. ఉద్దేశపూర్వకంగానే తనపై ఇలా కుట్ర చేసి ఆ వీడియో టేపుని విడుదల చేశారని శరవణన్ వాదిస్తున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ చేత విచారణ జరిపించి, నిజాలని నిగ్గు తేల్చాలని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే పట్టుబడుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ఆ రాష్ట్ర హై కోర్టులో ఓ పిటిషన్ సైతం దాఖలు చేసింది. ప్రస్తుతానికి కోర్టుకి చేరిన ఈ ముడుపుల వ్యవహారం ఎప్పుడు, ఏ మలుపు తిరుగుతుందోనని తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలని పరిశీలకులు ఆసక్తిగా పరిశీలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.