యాప్నగరం

తొమ్మిదేళ్లు అవినీతిపై మోదీ ఏంచేశారు: సిద్ధరామయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కర్ణాటకలో అవినీతి బాగా పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు.

TNN 5 Feb 2018, 3:34 pm
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కర్ణాటకలో అవినీతి బాగా పెరిగిపోయిందని తీవ్ర ఆరోపణలు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం మోదీకి తగదని హితవు పలికారు. తన మాటలకు మోదీ వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బెంగళూరు పర్యటనకు వచ్చిన మోదీ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. లోక్‌పాల్‌పై కూడా ఆరోపణలు చేశారు. కర్ణాటకలో అవినీతి పెచ్చుమీరిపోయిందని ఆరోపించారు.
Samayam Telugu modi is facilitating corruption karnataka cm siddaramaiah
తొమ్మిదేళ్లు అవినీతిపై మోదీ ఏంచేశారు: సిద్ధరామయ్య


మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ సోమవారం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమరం నిజాయితీగా, వాస్తవికంగా జరగాలని మోదీకి సిద్ధా సూచించారు. అసలు దేశానికి ప్రధాన మంత్రి అయ్యే నైతిక హక్కు మోదీకి లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. ‘లోక్‌పాల్ మీద మాట్లాడే నైతిక హక్కు మోదీకి ఎక్కడుంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్ల కాలంలో కనీసం లోకాయుక్త కూడా ఏర్పాటుచేయలేదు. ఆయన అవినీతిని పెంచి పోషిస్తున్నారు. దేశానికి పీఎం అయ్యే నైతిక హక్కు ఆయనకు లేదు’ అని సిద్ధా విరుచుకుపడ్డారు.

ఈ రాష్ట్రాన్ని కించపరుస్తూ ప్రధాని చెప్పిన అబద్ధాలు కన్నడిగుల ఆత్మాభిమానాన్ని గాయపరిచాయని సిద్ధరామయ్య ఆరోపించారు. ‘బీజేపీ అధ్యక్షుడికి ఒక హత్య కేసుతో సంబంధముంది. ఆయన అబద్ధాలు మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ కూడా జైలుకు వెళ్లిన ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని చూస్తున్నారు. రాష్ట్రం గురించి ప్రధాని పచ్చి అబద్ధాలు చెప్పి కన్నడిగుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు’ అని సిద్ధరామయ్య మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.