యాప్నగరం

'పాపి'స్థాన్ నీకు మూడింది.. కాచుకో: ప్రధాని మోడీ

యూరీ ఘటనను జాతి ఎప్పటికీ మరిచిపోబోదని, తగిన శాస్తి చేసి తీరతామని ప్రధానమంత్రి ఉద్హాటించారు

TNN 25 Sep 2016, 5:18 pm
యూరీ ఘటనను జాతి జనులు ఎప్పటికీ మరిచిపోబోరని, తగిన శాస్తి చేసి తీరతామని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్హాటించారు. ప్రధానమంత్రి తన మన్ కి బాత్ రేడియో కార్యక్రమం ద్వారా ఆదివారం నాడు ఆకాశవాణిలో ప్రసంగించారు. ఆయన తన ప్రసంగాన్ని యూరీ అమరవీరులను స్మరిస్తూ, వారికి ప్రణమిల్లుతూ ప్రారంభించారు. తన ప్రసంగంలో ఆయన స్వచ్ఛభారత్, పారాలింపిక్స్ ఇలా పలు అంశాలను స్పృశించారు. యూరీ అమరుల కుటుంబాలకు జాతి యావత్తు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాకిస్థాన్ కు రోజులు దగ్గరపడ్డాయని ఘాటుగా వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన రియో పారాలింపిక్స్ లో దేశం తరఫున పాల్గొని అద్భుత ప్రతిభ కనపరిచిన ఆటగాళ్లను గురించి గుర్తుచేసుకున్నారు. పతకాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు. దీపామాలిక్, దేవేంద్ర జఝారియా తదితరులు ఇతరులకు స్ఫూర్తిదాయకమన్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా నిలబెట్టేందుకు తాను చేస్తున్న కృషికి దేశప్రజల నుండి అద్భుతమైన మద్దతు లభిస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. త్వరలో ప్రారంభించనున్న స్వచ్ఛ భారత్ హెల్ప్ లైన్ 1969 నంబరు గురించి వివరించారు. త్వరలోనే దేశంలో ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి లక్ష్యం నెరవేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.