యాప్నగరం

గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌కు మోడీ శంకుస్థాపన

యూపీ: గోరఖ్‌పూర్ లో నిర్మించతలపెట్టిన ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రధాని మోడీ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

TNN 22 Jul 2016, 4:16 pm
యూపీ: గోరఖ్‌పూర్ లో నిర్మించతలపెట్టిన ఎయిమ్స్ ఆస్పత్రికి ప్రధాని మోడీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్ ధియేటర్లు, 750 పడకలతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. కాగా శంకుస్థాపన కార్యక్రమంలో యూపీ గవర్నర్ రామ్ నాయక్ , కేంద్ర మంత్రులు జేపీ‌నడ్డా, కల్‌రాజ్ మిశ్రా, పియూస్ గోయల్, అనంత్ మిశ్రా, పీయూష్ గోయల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Samayam Telugu modi lays foundation for gorakhpur aims hospital
గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌కు మోడీ శంకుస్థాపన


రూ.6 వేల కోట్లతో ఎరువుల ప్లాంట్ పునరుద్ధరణ...

దాదాపు రెండన్నర దశాబ్దాల పాటు మూతబడిన గోరఖ్ పూర్ ఎరువుల ప్లాంట్ ను ప్రధాని మోడీ పునరుద్దరించారు. దీని కోసం 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు చెందిన ఈ ప్లాంట్ 1990 నుంచి ఖాళీగా ఉంది. 26 ఏళ్ల తర్వాత ప్లాంట్ పునరుద్దరించాలని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ ప్లాంట్ పునరుద్దరణతో 4 వేల మందికి ఉపాధి లభించనుంది. దీంతో పాటు రైతులకు యూరీయా కొరత తీరనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.