మార్కెట్లోకి 'మోదీ చీరలు'.. గుజరాత్లో యమ క్రేజ్
సూరత్ మార్కెట్లో నాలుగు రకాల చీరలు.. వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ‘మోదీ చీరలు’వచ్చాయని తెలిసిందే లేదో.. మహిళలు షాపులకు క్యూ కట్టారు. చీరల్ని కొనుగోలు చేసేందుకు తెగ ఎగబడ్డారు.
Samayam Telugu 13 Feb 2019, 5:15 pm
ప్రధానాంశాలు:
- మోదీ చీరలకు గుజరాత్లో ఫుల్లు డిమాండ్
- మార్కెట్లోకి రాగానే హాట్ కేకుల్లా అమ్మకం
- డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో చీరల తయారీ
ప్రధాని మోదీ మేనియా మామూలుగా లేదండోయ్. మొన్నటి వరకు మోదీ టీ-షర్టులు, కీ చైన్లు, వెడ్డింగ్ కార్డులకు పరిమితమైన క్రేజ్ ఇప్పుడు చీరలకు కూడా పాకింది. గుజరాత్లో ఏకంగా ‘మోదీ చీరలు’మార్కెట్లోకి వచ్చాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు సూరత్‌లో ఈ చీరల సీజన్ మొదలయ్యింది.మోదీ చిత్రాలతో ఉన్న చీరలు అలా వచ్చాయో లేదో.. ఇలా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట. సూరత్ మార్కెట్లో నాలుగు రకాల చీరలు.. వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ‘మోదీ చీరలు’వచ్చాయని తెలిసిందే లేదో.. మహిళలు షాపులకు క్యూ కట్టారు. చీరల్ని కొనుగోలు చేసేందుకు తెగ ఎగబడ్డారు. రకరకాల రంగుల్లో డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో మోదీ ఫోటోలను ఈ చీరలపై ముద్రిస్తున్నారట వ్యాపారులు. శారీలకు మంచి గిరాకీ వచ్చిందని.. రాబోయే రోజుల్లో మోదీతో పాటూ ప్రముఖ రాజకీయ నేతల చిత్రాలను ముద్రించి చీరల్ని మార్కెట్లోకి తీసుకొస్తామంటున్నారు.
మొత్తానికి ఎన్నికలకు ముందు మొదలైన ఈ మోదీ చీరలు మహిళల్లో మంచి క్రేజ్ తెచ్చింది. ఇటు వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. మరి బీజేపీకి ఓట్లు ఏమేరకు రాలుస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.
మొత్తానికి ఎన్నికలకు ముందు మొదలైన ఈ మోదీ చీరలు మహిళల్లో మంచి క్రేజ్ తెచ్చింది. ఇటు వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి. మరి బీజేపీకి ఓట్లు ఏమేరకు రాలుస్తుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే.