యాప్నగరం

ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయుడే: మోహన్ భగవత్

ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయుడేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగత్ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కేవలం హిందువుల కోసం మాత్రమే కాదని.. ఇది భారతీయులందరి కోసం పని చేసే సంస్థ అని అన్నారు.

Samayam Telugu 7 Jun 2018, 8:53 pm
ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ భారతీయుడేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగత్ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కేవలం హిందువుల కోసం మాత్రమే కాదని.. ఇది భారతీయులందరి కోసం పని చేసే సంస్థ అని అన్నారు. గురువారం (జూన్ 7) నాగపూర్‌లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన 'తృతీయ వర్ష్ వర్గ్'లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వస్తుందన్నారు. దేశంలో అనేక భాషలు, సంస్కృతులు సమ్మిళితమై ఉన్నాయని అన్నారు.
Samayam Telugu bagat


భారత మాత అందరికీ తల్లి అని.. భారతదేశానికి సహనం, సంయమనంతో వ్యవహరించే చరిత్ర ఉందని తెలిపారు. యావత్తు సమాజాన్ని సమైక్యపరచాలన్నదే ఆరెస్సెస్ లక్ష్యమని చెప్పారు. అయితే, రాజకీయ సిద్ధాంత వైరుద్ధ్యాలు కూడా మనలో ఉన్నాయని, అంతమాత్రాన మనలో విభేదాలు ఉన్నాయని కాదని అన్నారు. నాటి స్వాతంత్య్ర పోరాటంలో సిద్ధాంత వైరుద్ధ్యాలున్నప్పటికీ అందరి లక్ష్యం ఒక్కటేనని, రాజకీయ వైరుద్ధ్యాలున్నా దేశాభివృద్ధే మన లక్ష్యమని అన్నారు. దేశం కోసం ప్రజలంతా సంఘటితమవ్వాలని పిలుపునిచ్చారు. ఆరెస్సెస్ ప్రజాస్వామిక ఆలోచనా విధానంతో నడుస్తోందని తెలిపారు. మార్పు కోసం ప్రజలంతా సంఘటితమవ్వాలన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్దేశిస్తూ.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప విజ్ఞానవంతుడని, ఆయన ఎప్పటికీ ఆయనలాగే ఉంటారని అన్నారు. ఆయన వంటి విజ్ఞానులను ఆహ్వానించి, వారి సందేశాన్ని అందుకోవడం ఆరెస్సెస్‌కు సాధారణ విషయమేనని చెప్పారు. ప్రణబ్‌ను ఆహ్వానించడంపైనా, ఆయన ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనడంపైనా వస్తున్న విమర్శలను భగవత్ తిప్పికొట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.