యాప్నగరం

వాటీజ్ దిస్ గుసగుస: ములాయం దారెటు?

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ, ఎస్పీ నేతలు ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారోత్సవంలో

Samayam Telugu 20 Mar 2017, 10:32 am
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ, ఎస్పీ నేతలు ఆదివారం సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారోత్సవంలో నవ్వుతూ కనిపించారు. ములాయం సింగ్ యాదవ్ ప్రధాని మోదీ చెవిలో ఏదో చెబుతూ కనిపించడం అందరిని ఆలోచింపజేస్తోంది. ఊహించని ఫలితాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచిన బీజేపీ...మాంచి ఊపుమీదుంది. ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దక్కించుకుంది.
Samayam Telugu mulayam whispers with modi at yogis swearing in ceremony
వాటీజ్ దిస్ గుసగుస: ములాయం దారెటు?


ఫలితాల రోజు జమ్మూ కశ్మీర్ కు చెందిన నేత ఒమర్ అబ్దుల్లా అయితే 2019పై ప్రతిపక్షాలు ఆశలు వదులుకోవాలని... అంతా 2024ను టార్గెట్ పనిచేయాలని వ్యాఖ్యానించడం.. విపక్షాలు మోదీ నాయకత్వానికి ఎలా జంకుతున్నాయో చెప్పకనే చెబుతోంది.

ఫ్యామిలీ గొడవలు, కాంగ్రెస్ తో చేతులు కలపడం, మోదీ వేవ్ లో ఎస్పీ కొట్టుకుపోయింది. తమ ప్రభుత్వం చేపట్టిన ‘పనేలే మాట్లాడతాయ్’ అని గొప్పలు పోయి అఖిలేష్...అభివృద్ధి మంత్రం ఏమాత్రం పారలేదు. ఎస్పీ-కాంగ్రెస్, బీఎస్పీల అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన పనితీరును కనబరిచింది. దీంతో మళ్లీ ఎస్పీ నాయకత్వ బాధ్యతలు వ్యవస్థాపకులు మలాయం సింగ్ కు కట్టబెట్టాలని శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీని యూపీలో అడుగుపెట్టకుండా అవసరమైతే బీఎస్పీతోనైనా చేతులు కలుపుతామని ఫలితాలకంటే ముందు రోజు అఖిలేష్ చెప్పిన సంగతి తెలిసిందే. అయినా ఫలితాలు అఖిలేష్ ఆశల్ని అడియాసలు చేశాయి.

ఆదివారం జరిగిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారంలో ములాయం, ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ లు మోదీ సహా ఇతర బీజేపీ అగ్రనేతలతో నవ్వుతూ కనిపించారు. ములాయం అయితే మోదీ చెవిలో ఏదో గుసగుసలాడుతూ కనిపించారు. దీంతో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

SCAM (Samajwadi, Congress and Mayawati) అంటూ ఎస్పీ-కాంగ్రెస్ కూటమి సహా బీఎస్పీ అధినేత్రి మాయావతిని ప్రధాని మోది తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

జనతా పరివార్ ను పునరుద్ధరించే ప్రయత్నం చేసే ములాయం....2019 లోక్ సభ ఎన్నికల్లోనూ మోదీదే హవా ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో....బిహార్ సీఎం నితీష్ కుమార్ లా....కాసేపు మోదీకి మద్దతుగా..మరికాసేపు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి హాజరుకాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.