యాప్నగరం

ఈ నగరానికి ఏమైంది.. వరుస ప్రమాదాలు!

అంధేరీ బ్రిడ్జ్ కూలి 12 గంటలు కూడా గడవక ముందే.. మరో బ్రిడ్జ్‌పై చీలికలు రావడం ముంబయి వాసులను కలవరపెడుతోంది. మంగళవారం (జులై 3) రాత్రి దక్షిణ ముంబయిలోని నానా చౌక్ - నోవెల్టి సినిమా ప్రాంతాలను కలిపే గ్రాంట్ రోడ్ బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయి.

Samayam Telugu 4 Jul 2018, 12:42 pm
అంధేరీ బ్రిడ్జ్ కూలి 12 గంటలు కూడా గడవక ముందే.. మరో బ్రిడ్జ్‌పై చీలికలు రావడం ముంబయి వాసులను కలవరపెడుతోంది. మంగళవారం (జులై 3) రాత్రి దక్షిణ ముంబయిలోని నానా చౌక్ - నోవెల్టి సినిమా ప్రాంతాలను కలిపే గ్రాంట్ రోడ్ బ్రిడ్జికి పగుళ్లు వచ్చాయి. దీంతో దీనిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఈ బ్రిడ్జికి పగుళ్లు రావటంతో.. కెన్నడీ బ్రిడ్జి వైపు నుంచి ట్రాఫిక్‌ను మళ్లించారు. బ్రిడ్జిపై ఏర్పడిన పగుళ్లతో తీసిన ఫొటోను ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తూ.. ప్రజలు అటువైపు వెళ్లొద్దని పోలీసులు కోరారు.
Samayam Telugu mumbai bridge


ట్రాఫిక్ మళ్లింపు వివరాలను తెలిపారు. రెండు వారాలుగా వర్షాల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ముంబయి కార్పొరేషన్ తెలిపింది. ఈ పగుళ్లతో బ్రిడ్జి పటిష్ఠతను పరిశీలించడానికి ఇంజినీర్లు రంగంలోకి దిగారు.

మంగళవారం అంధేరీ రైల్వే స్టేషన్‌లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి‌లో కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. ఆ సమయంలో రైళ్లేవీ ఆ మార్గంలో రాకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన 12 గంటల్లోపే గ్రాంట్ రోడ్ బ్రిడ్జిపై పగుళ్లు ఏర్పడటంతో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.