యాప్నగరం

శిథిలావస్థలో గుడి... ముస్లిం యువకుడి చేయూత

దేశవ్యాప్తంగా శిథిలావస్దలో ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అవి కూలిపోతున్నా... పాలకులు కనీసం పట్టించుకోని రోజులివి. కాని గుజరాత్‌లో ఓ ముస్లిం మాత్రం అలా చూస్తూ వదిలెయ్యలేదు. తన సొంత డబ్బులతో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి... శభాష్ అనిపించుకుంటున్నాడు.

TNN 6 Feb 2018, 5:50 pm
దేశవ్యాప్తంగా శిథిలావస్దలో ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. అవి కూలిపోతున్నా... పాలకులు కనీసం పట్టించుకోని రోజులివి. కాని గుజరాత్‌లో ఓ ముస్లిం మాత్రం అలా చూస్తూ వదిలెయ్యలేదు. తన సొంత డబ్బులతో ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి... శభాష్ అనిపించుకుంటున్నాడు. అహ్మదాబాద్‌కు సమీపంలోని మీర్జాపూర్ ప్రాంతంలో 500 ఏళ్లనాటి భిడ్ భంజన్ హనుమాన్ గుడి ఉంది. అయితే మందిరం శిథిలావస్థకు చేరింది. రోజు నమాజ్‌కు అటువైపుగానే వెళుతున్నమొయిన్ మెమన్ ఆలయాన్ని గమనించేవాడు. ఒక రోజు పూజారి దగ్గరకు వెళ్లి విషయమేంటో అడిగి తెలుసుకున్నాడు. ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆరా తీశాడు. పరిస్థితిని గమనించి... తనే స్వయంగా రంగంలోకి దిగాడు.
Samayam Telugu muslim undertakes renovation of hanuman temple
శిథిలావస్థలో గుడి... ముస్లిం యువకుడి చేయూత


ఆలయాన్ని తానే అభివృద్ధి చేస్తానని పూజారికి చెప్పాడు. అన్నట్లుగానే సొంత డబ్బుతో ఆలయానికి సంబంధించిన అన్ని మరమ్మత్తులును చేపట్టాడు. కొత్త హంగులతో ఆలయానికి కొత్త మెరుగులు దిద్దుతున్నాడు. గుడికి సేవ చేయడం చాలా గర్వంగా ఉందంటున్నాడు మెమన్. ఈ గొప్ప కార్యాన్ని బాధ్యతగా భావిస్తున్నానని.. గతంలో మందిర వైభవం చూసి పెరిగానని చెప్పుకొచ్చాడు. అలాంటిది ఇలా కూలడానికి సిద్ధంగా ఉండటంతో... చూస్తూ ఉండలేకపోయానన్నాడు. వారంలో పనులన్నీ పూర్తి చేస్తానని చెప్పాడు. ఓ ముస్లిం అయినా మెమన్ చూపిస్తున్న మతసామరస్యం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.