యాప్నగరం

Bengaluru: మహిళకు వింత అనుభవం.. పేరు అడిగి ఇల్లు అద్దెకివ్వని యజమానులు.. ట్వీట్ వైరల్

బెంగళూరు (Bengaluru) మహిళ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. బెంగళూరులో అద్దె కోసం ఇల్లు వెదుకుతున్న క్రమంలో తనకు ఎదురైన అనుభవం గురించి ట్వీట్ ద్వారా తెలియజేసింది. తను కేవలం ముస్లిం కావడం వల్లే తనకు ఇల్లు అద్దెకివ్వడానికి నిరాకరించారు. ఆ ట్వీట్ వైరల్ అయింది. అయితే దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎవరి నమ్మకాలు వారివని చెబితే.. మరికొందరు ఇది కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 19 Aug 2022, 7:44 pm

ప్రధానాంశాలు:

  • బెంగళూరులో ఓ మహిళకు వింత అనుభవం
  • తన అనుభవాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన మహిళ
  • మిశ్రమంగా స్పందిస్తున్న నెటిజన్లు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bengaluru woman tweet
Bengaluru: అద్దె ఇంటి కోసం చూస్తున్నారా..? అద్దె ఇంటి కోసం వెదుకుతున్న ఓ మహిళ అనుభవం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. బెంగళూరులో రెంటెడ్ హౌస్ కోసం చూస్తున్న మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఖాళీగా ఉన్నా సరే ఆమెకు ఇల్లు ఇవ్వమని ఓ ఇంటి యజమాని తేల్చి చెప్పేశారు. కేవలం ఆ తన మత విశ్వాసాల కారణంగా ఆమెకు ఇల్లు దొరకలేదు. యజమానులతో తిరస్కరణకు గురైంది. హైఫా అని పిలువబడే మహిళ.. ఆ యజమానులతో ఇంటి గురించి మాట్లాడిన ఛాటింగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
హైఫా నమ్మే మత విశ్వాసం గురించి తెలుసుకున్న తర్వాత వారు ఆమెకు ఇల్లు ఇవ్వడానికి నిరాకరించారు.
ఒక ఇల్లు అద్దెకుందని తెలుసుకున్న హైఫా సదరు మధ్యవర్తిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసింది. వివరాల కోసం మెసెజ్ చేసింది. అవతలి వ్యక్తి మొదట పేరు అడిగారు. తన పేరు హైఫా అని చెప్పి.. ఏదన్న సమస్య ఉందా..? అని ప్రశ్నించింది. దానికి అవును అని బదులిచ్చారు. ఇల్లు అందుబాటులో లేదా..? అని అడిగిన ప్రశ్నకు.. "ఇల్లు ఉంది. కానీ ఓనర్లు హిందూ కుటుంబాన్ని మాత్రమే కోరుకుంటున్నారు." అని సమాధానం ఇచ్చారు. కేవలం హైఫా ముస్లిం మహిళ కావడం వల్ల అద్దె ఇల్లు దక్కించుకోవడానికి అనర్హురాలైంది.

హైఫా బెంగళూరులో తన అద్దె ఇంటి కోసం వెదుకుతున్న క్రమంలో తనకు ఎదురైన కష్టాలు గురించి తెలియజేస్తూ ఈ చాట్‌ను షేర్ చేసింది. "ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య 75వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం పూర్తైతే.. నేను నా ఆగస్ట్ 15వ తేదీని ఎలా గడిపాను" అని ఆమె రాసింది. హైఫా పోస్ట్ వైరల్ అయింది. ఇప్పటికే ఈ పోస్ట్‌కి 11 వేల మందికిపైగా లైక్ చేశారు. అనేక మంది కామెంట్‌ చేశారు. అయితే ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



కొందరు చాలా తప్పు అని, చాలా విచారకరమైన విషయమని కామెంట్ చేశారు. మరికొందరు మాత్రం ఇందులో తప్పేం లేదని సమర్థించారు. అది వారి ఇల్లు వారి వారి కట్టుబాట్లు, నమ్మకాలు వారికుంటాయంటూ కామెంట్లు పెట్టారు. చాలా నగరాల్లో హిందూ కుటుంబాలను తమ ఇళ్లను మాంసం తినే వారికి ఇవ్వడం లేదంటూ మరికొందరు తమ ట్వీట్‌‌లలో పేర్కొన్నారు. అలాగే తమకు ఇలాంటి అనుభవాలున్నాయని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి ఇలాంటి అనుభవాలుంటున్నాయంటున్నారు. కులం కారణంగా కూడా ఇల్లు అద్దెకివ్వని సందర్భాలున్నాయని తమ గోడును వెల్లబుచ్చుకుంటున్నారు.

Read Also:Bihar Fake Police: "దొంగ" పోలీస్ స్టేషన్... డీఎస్పీ వంటి హోదాలతో పోస్టులు.. వామ్మో ఎక్కడ దొరికారు రా..!
Read Also:అమ్మాయిలు, అబ్బాయిలు కలసి చదువుకోవడం ప్రమాదకరం: కేరళ నేత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.